Homeజిల్లాలునిజామాబాద్​Armoor | ఫోన్​పేలో ఒకరికి పంపాల్సిన డబ్బులు మరొకరికి.. చివరికి ఏమైందంటే..

Armoor | ఫోన్​పేలో ఒకరికి పంపాల్సిన డబ్బులు మరొకరికి.. చివరికి ఏమైందంటే..

ఫోన్​పేలో ఒకరికి బదులుగా మరొకరికి డబ్బులు వెళ్లగా.. బాధితులు పోలీసులను సంప్రదించారు. దీంతో పోలీసుల సహకారంతో బాధితులకు తిరిగి డబ్బులు చేరాయి.

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్: Armoor | ఫోన్​పేలో (PhonePe) ఒకరికి పంపాల్సిన డబ్బులు మరొకరిగా పంపగా..చివరకు కథ సుఖాంతమైంది.. వివరాల్లోకి వెళ్తే.. ఈనెల 5న హైదరాబాద్​లోని (Hyderabad) అశోక్​నగర్​కు చెందిన గిరి విజయలక్ష్మి అనే మహిళ రూ.66వేలను ఫోన్​పేలో తన స్నేహితులకు పంపాల్సి ఉండగా మరో నంబర్​కు పొరపాటున పంపించారు.

చివరకు చెక్​ చేసుకోగా వేరే నంబర్​కు డబ్బులు వెళ్లినట్లు గుర్తించి ఆ నంబర్​కు ఫోన్​ చేయగా.. ఆర్మూర్​కు చెందిన నూతల సత్తమ్మ ఫోన్​పేకు వెళ్లినట్లుగా గుర్తించారు. అనంతరం బాధితులు హైదరాబాద్​ నుంచి నేరుగా గురువారం ఆర్మూర్​కు (Armoor) వచ్చి ఏసీపీ వెంకటేశ్వర్​రెడ్డిని సంప్రదించారు. దీంతో ఆయన వెంటనే నూతుల సత్మెమ్మను పిలిపించారు. విచారించగా తనకు రూ.66వేలు వచ్చిన మాట వాస్తమేనని ఆమె ఒప్పుకుని బాధితులకు తిరిగి వాటిని అందజేశారు. ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర్​రెడ్డి నూతల సత్తెమ్మను సన్మానించారు.