అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Smriti Mandhana | భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్, యూత్ ఐకాన్ స్మృతి మంధాన జీవితంలో ఆనందం వెల్లివిరుస్తోంది. తన అందం, ఆటతో అభిమానులను మంత్రముగ్ధుల్ని చేసే స్మృతి, నవంబర్ 23న సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ (Music Director Palash Muchhal)ని పెళ్లి చేసుకోనుంది.
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా (Social Media)లో వినిపిస్తున్న రూమర్లకు ముగింపు పలుకుతూ, తన ఎంగేజ్‌మెంట్ జరిగినట్టు స్వయంగా స్మృతి ధృవీకరించింది. ఇక స్మృతి–పలాష్ వివాహంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆఫీస్ నుంచి అధికారిక సందేశం విడుదల కావడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
Smriti Mandhana | ఏళ్ల తరబడి సాగిన ప్రేమ
‘‘స్మృతి మంధాన (Smriti Mandhana), పలాష్ ముచ్చల్ పెళ్లి జరగబోతుందన్న విషయం తెలుసుకొని చాలా సంతోషించాను. రెండు కుటుంబాలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. జీవితమంతా ఒకరి కోసం ఒకరు అండగా నిలవాలి. పెళ్లి వేడుకలో జరగబోయే ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ కూడా ఆనందభరితంగా సాగాలి. నా ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతోనే ఉంటాయి’’ అని ప్రధాని మోదీ (Prime Minister Modi) శుభాకాంక్షలు తెలిపారు.ఇక జెమీమా రోడ్రిగ్స్‌తో కలిసి చేసిన ఇన్‌స్టా రీల్‌లో ‘ఎంగేజ్‌మెంట్’ జరిగినట్టు పాట ద్వారా తెలిపిన స్మృతి, చివర్లో తన రింగ్ చూపించి విషయాన్ని అధికారికంగా బయటపెట్టింది. దీంతో అభిమానులు, క్రికెట్ వర్గాలు ఈ జంటకి బెస్ట్ విషెస్ అందించారు.
స్మృతి–పలాష్ రిలేషన్‌షిప్ చాలా ఏళ్ల నాటిదే. ‘‘ఇండోర్ కోడలు రాబోతుంది’’ అంటూ పలాష్ ముచ్చల్ ముందే క్లారిటీ ఇచ్చాడు. ఈ క్రమంలో వీరి పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వార్తలు మరింత బలపడ్డాయి. కొద్దిరోజుల క్రితం జరిగిన వన్డే వరల్డ్ కప్ 2025లో భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో ట్రోఫీ గెలుచుకుంది. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా స్మృతి రికార్డు సృష్టించింది. ట్రోఫీ పట్టుకున్న స్మృతితో పలాష్ ముచ్చల్ ఫోజులు ఇవ్వడం వీరి బంధం మరింత హైలైట్ అయ్యలా చేసింది. స్మృతి మంధాన క్రికెట్ కెరీర్ చూస్తే.. టెస్టులు: 7, వన్డేలు: 117, టీ20లు: 153, వన్డే సెంచరీలు: 14, టెస్టు సెంచరీలు: 2, టీ20 సెంచరీ: 1. ఇక డబ్ల్యూపీఎల్ 2024లో స్మృతి కెప్టెన్సీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కప్ ఎగరేసుకుపోయింది.
