అక్షరటుడే, ఇందూరు: Red Cross Society | జిల్లాలో రెడ్‌క్రాస్ సొసైటీ సేవలు అభినందనీయమని ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు సలహాదారుడు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి (Bodhan MLA Sudarshan Reddy) పేర్కొన్నారు. రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్‌లో (Red Cross Blood Bank) కోల్డ్ స్టోరేజ్‌ను ఆదివారం ఆయన ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కోల్డ్ స్టోరేజీ యూనిట్ ప్రారంభంతో రక్త నిల్వ సామర్థ్యం మరింత మెరుగుపడుతుందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు మెరుగైన రక్తసేవలు అందించేందుకు కోల్డ్ స్టోరేజ్ ఉపయోగపడుతుందన్నారు.
Red Cross Society | సేవలు అభింనందనీయం..
జిల్లాలో తలసేమియా రోగులతో పాటు అత్యవసర పరిస్థితుల్లో రెడ్‌క్రాస్ అందిస్తున్న సేవలు అభినందనీయమని ఎమ్మెల్యేలు ప్రశంసించారు. యువతను మరింతగా సేవల్లో భాగస్వామ్యం కల్పిస్తూ ముంందుకు వెళ్లాలని వారు సూచించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీకి సుమారు రూ.15లక్షలతో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సోలార్ ప్లాంట్ ద్వారా విద్యుత్ ఖర్చు గణనీయంగా తగ్గి, పేద రోగులకు అందించే సేవలు మరింత బలోపేతం అవుతాయని వారు పేర్కొన్నారు.
Red Cross Society | టీబీ వ్యాధిగ్రస్థులకు పోషకాహారం కిట్లు..
అనంతరం, క్షయ (TB) వ్యాధితో బాధపడుతున్న 20 మంది రోగులకు పోషకాహార ఆరోగ్య కిట్లను ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. అలాగే రెడ్‌క్రాస్ తలసేమియా వార్డులో చికిత్స పొందుతున్న తలసేమియా రోగులకు పండ్లను పంపిణీ చేసి వారికి మనోధైర్యం కల్పించారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, డా.కవిత రెడ్డి, అరికెల నర్సారెడ్డి, రెడ్‌క్రాస్ జిల్లా ఛైర్మన్ బుస్సా ఆంజనేయులు, వైస్ ఛైర్మన్ డొల్లా రాజేశ్వర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్, కోశాధికారి కరిపె రవీందర్, జిల్లా కార్యదర్శి గోక అరుణ్ బాబు, నిజామాబాద్ డివిజనల్ ఛైర్మన్ డాక్టర్ శ్రీశైలం మ్యానెగింగ్ కమిటీ సభ్యులు డా. నీలి రాంచందర్, సూర్య నారాయణ, డాక్టర్ అబ్బాపూర్ రవీందర్, జి. హనుమంతరావు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.