అక్షరటుడే, ముప్కాల్: SRSP | మత్స్యకారులకు చేపపిల్లల పంపిణీలో కోత విధించడం సరైంది కాదని ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి (MLA Prashanth Reddy) అన్నారు. ఎస్సారెస్పీలో సోమవారం చేపపిల్లలను వదిలే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్స్యకారులకు గతేడాది కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) 1.74 కోట్ల చేప పిల్లలకు బదులుగా కేవలం 83 లక్షలు మాత్రమే సరఫరా చేసిందన్నారు.
రొయ్య పిల్లలను పూర్తిగా ఇవ్వలేదని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ పాలనలో చేప,రొయ్య పిల్లలతో పాటు మోపెడ్‌లు, వలలు, వాహనాలు, సంఘ భవనాలు వంటి అనేక సౌకర్యాలు మత్స్యకారులకు (fishermen) అందించామని గుర్తుచేశారు. అలాగే గతంలో ఇవ్వని 70 లక్షల రొయ్య పిల్లలతో కలిపి మొత్తంగా 1.40 కోట్లు తప్పనిసరిగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, మత్స్యకారులు పాల్గొన్నారు.
