Homeజిల్లాలుకామారెడ్డిMla Madan Mohan | అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మదన్​మోహన్​ శంకుస్థాపనలు

Mla Madan Mohan | అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మదన్​మోహన్​ శంకుస్థాపనలు

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్​మోహన్​ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ మేరకు సదాశివనగర్​, గాంధారి మండలాల్లో పర్యటించారు.

- Advertisement -

అక్షరటుడే సదాశివనగర్/ గాంధారి: Mla Madan Mohan | పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మదన్​మోహన్​ (Mla Madan Mohan) మంగళవారం శంకుస్థాపనలు చేశారు. సదాశివనగర్​, గాంధారి మండలాల్లో మంగళవారం పర్యటించారు.

ఈ సందర్భంగా భూమిపూజ, శంకుస్థాపనలు, చీరల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సదాశివనగర్ మండల కేంద్రంలో ఎస్సీకాలనీలో రూ.25 లక్షలలతో సీసీ రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణ పనులకు (drainage works) శంకుస్థాపన చేశారు. ఎస్సీ కమ్యూనిటీ హాల్ కోసం రూ.5లక్షల నిధులు మంజూరు చేశారు. హైమాస్ట్​ లైట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.

అనంతరం అమర్లబండ గ్రామంలోని హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ. 2.70 కోట్ల వ్యయంతో శంకుస్థాపన పనులను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్​మోహన్​ మాట్లాడుతూ 30 ఏళ్ల గ్రామస్థుల కలను నెరవేర్చనున్నట్లు ఆయన తెలిపారు.

Mla Madan Mohan | గాంధారి మండల కేంద్రంలో..

గాంధారి మండలకేంద్రంలో రూ.4.9 కోట్ల వ్యయంతో పోచమ్మ రేవు వంతెన (Pochamma Revu Bridge) నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం రైతు వేదికలో ఇందిరమ్మ చీరల (Indiramma sarees) పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.