అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్‌ను (MLA Madan Mohan) హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు (MLA Thota Lakshmi Kantarao), కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ను (DCC President Mallikarjun) సన్మానించారు. జిల్లాలోని నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ.. సమిష్టిగా కష్టపడి పనిచేయాలని సూచించారు. పార్టీ బలోపేతం కోసం శాయశక్తులా కృషి చేయాలన్నారు. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ (Kamareddy district Congress) శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నింపుతూ, వ్యూహాత్మాకంగా ముందుకు వెళ్తూ పార్టీకి విజయాలు అందించాలని పేర్కొన్నారు. పార్టీ అభివృద్ధికి తన సంపూర్ణ సహకారం ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నాయకులు భుజంగారి భాస్కర్ రెడ్డి, సాయి పటేల్ పాల్గొన్నారు.