అక్షరటుడే, కామారెడ్డి: Minister Seethakka | కామారెడ్డి నియజకవర్గంలో గురువారం జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క (Minister Seethakka) పర్యటించనున్నారు. ఉదయం 10:30 గంటలకు భిక్కనూరు మార్కెట్ కమిటీ యార్డులో (Bhikkanoor Market Committee Yard) పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
అలాగే భిక్కనూరులో ఇందిరమ్మ చీరల (Indiramma sarees) పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు కామారెడ్డి పట్టణంలోని (Kamareddy town) ఇందిరాగాంధీ స్టేడియంలో ఇండోర్ స్టేడియం పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇల్చిపూర్ శివారులో వృద్ధాశ్రమాన్ని మంత్రి ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి కామారెడ్డి మార్కెట్ యార్డులో (Kamareddy Market Yard) పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమాలలో మంత్రితో పాటు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కూడా పాల్గొననున్నారు. ఈ మేరకు మంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు.
