Homeజిల్లాలుకామారెడ్డిMinister Ponnam | వివాహ వేడుకలో పాల్గొన్న మంత్రి పొన్నం

Minister Ponnam | వివాహ వేడుకలో పాల్గొన్న మంత్రి పొన్నం

కామారెడ్డిలో జరిగిన తన మేన కోడలి వివాహానికి మంత్రి పొన్నం ప్రభాకర్​ హాజరయ్యారు. టీపీసీసీ చీఫ్​ బొమ్మ మహేష్​కుమార్​తో కలిసి వధూవరులను ఆశీర్వదించారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి/ఎల్లారెడ్డి: Minister Ponnam | రాష్ట్ర రవాణా శాఖ మంత్రి (Minister of Transport) పొన్నం ప్రభాకర్ కామారెడ్డి పట్టణంలోని సత్య కన్వెన్షన్ హాల్​లో జరిగిన వివాహ వేడుకలో పాల్గొన్నారు. మంత్రి మేన కోడలి వివాహం కామారెడ్డి ప్రముఖ న్యాయవాది రాజగోపాల్ గౌడ్ కుమార్తెతో జరిగింది.

మంత్రితో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Bomma), ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ (Shabbir Ali), ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు (MLA Madan Mohan Rao), ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra), కామారెడ్డి సబ్​ డివిజన్​ ఏఎస్పీ చైతన్య రెడ్డి, టీపీసీసీ జనరల్ సెక్రెటరీలు గడ్డం చంద్ర శేఖర్ రెడ్డి, బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి తదితరులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.

Minister Ponnam | సుదర్శన్​ రెడ్డికి ఎమ్మెల్యే సన్మానం..

మంత్రి పొన్నం ప్రభాకర్​ మేన కోడలి వివాహం కామారెడ్డిలో జరగగా ప్రభుత్వ సలహాదారు బోధన్​ ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మల్యే మదన్​మోహన్​ రావు సుదర్శన్​రెడ్డిని ప్రత్యేకంగా సన్మానించారు.

Must Read
Related News