అక్షరటుడే, మెండోరా: Mendora police : మెండోరా మండలంలోని ఆయా గ్రామాల ప్రజలకు మెండోరా పోలీసులు పలు అంశాలపై సూచనలు చేశారు. ఆయా గ్రామాల్లోని ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు, ఇతర ప్రదేశాలకు, శోభాయాత్రలకు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లేటప్పుడు స్థానిక పోలీసులకు ముందస్తుగా సమాచారం అందించాలని ఎస్సై జాదవ్ సుహాసిని ఈ సందర్భంగా సూచించారు.
Mendora police : విలువైన వస్తువులు ఉంటే..
రానున్న సంక్రాంతి పండగ సందర్భంగా తమ సొంత ప్రాంతాలకు వెళ్లేవారు కొన్ని నిబంధనలు పాటించాలన్నారు. ఇంట్లో బంగారు ఆభరణాలు, నగదు ఉంటే బ్యాంకు లాకర్లో భద్రపర్చుకోవాలని, లేదంటే వెంట తీసుకెళ్ళాలని ఆమె సూచించారు.
ఇంటి డోర్‌కు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ వాడితే రక్షణగా ఉంటుందన్నారు. కాలనీ వాసులు ‘గస్తి బృందాల’ను ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు పక్కింటి వాళ్లకి, ఇరుగుపొరుగు వారికి సమాచారాన్ని అందిస్తే భద్రతాగా ఉంటుందన్నారు. అపరిచితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. స్థానిక పోలీసు స్టేషన్ లేదా డయల్ 100 కు సమాచారాన్ని అందించినా తాము అందుబాటులో ఉంటామని SI సుహాసిని తెలిపారు.