Homeఅంతర్జాతీయంEarthquake | జపాన్​లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

Earthquake | జపాన్​లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

జపాన్ తూర్పు తీరంలో భూకంపం వచ్చింది. దీంతో అధికారులు ఆ ప్రాంతానికి సునామీ హెచ్చరిక జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Earthquake | జపాన్​ (Japan)లో భారీ భూకంపం చోటు చేసుకుంది. దీంతో అధికారులు సునామీ (Tsunami) హెచ్చరికలు జారీ చేశారు.

జపాన్ తూర్పు తీరంలో ఇవాటే ప్రిఫెక్చర్ సమీపంలో 6.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో అధికారులు ఆ ప్రాంతానికి సునామీ హెచ్చరిక జారీ చేశారు. లోతులేని భూకంపం తర్వాత 1 మీటర్ ఎత్తు వరకు అలలు తీరప్రాంతానికి చేరుకోవచ్చని జపాన్ వాతావరణ సంస్థ అంచనా వేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Earthquake | కంపించిన భవనాలు

జపాన్ ఈశాన్య తీరానికి సమీపంలో భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (United States Geological Survey) తెలిపింది. దాదాపు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించింది. దీని ప్రభావంతో హోక్కైడో, టోహోకు, మియాగి వంటి ప్రాంతాల్లో భవనాలు కంపించాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పలు ప్రాంతాల్లో విద్యుత్​ సరఫరాకు సైతం అంతరాయం కలిగింది. పలు రైళ్లు, విమానాలు నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. భూకంపంతో అప్రమత్తమైన జపాన్​ ప్రభుత్వం సహాయక బృందాలు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసింది.

Must Read
Related News