అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mary Kom | ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి , ఒలింపిక్ పతకం సాధించిన భారత బాక్సింగ్ లెజెండ్ మేరీ కోమ్ (Mary Kom) తాజాగా తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న తీవ్రమైన సంక్షోభాలపై స్పందించారు.
తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలకు ముగింపు పలకాలని భావించిన ఆమె, విడాకులు (divorce), ఆర్థిక ఇబ్బందుల వెనుక ఉన్న వాస్తవాలను తొలిసారిగా బహిరంగంగా వెల్లడించారు. 2025లో తన భర్త ఓన్లర్‌తో చట్టపరంగా విడాకులు తీసుకున్నట్లు మేరీ కోమ్ తెలిపారు. కెరీర్ ఉజ్వలంగా సాగుతున్న రోజుల్లో తాను పూర్తిగా క్రీడలకే అంకితమై ఆర్థిక వ్యవహారాలను పెద్దగా పట్టించుకోలేదని చెప్పారు.
Mary Kom | నా విడాకులతో ఏం పని..
అయితే 2022లో గాయంతో పోటీలకు దూరమైన సమయంలోనే తన జీవితంలో అసలు నిజాలు బయటపడ్డాయని పేర్కొన్నారు. తాను అత్యంత విశ్వసించిన వ్యక్తి తనకు తెలియకుండా ఆస్తుల వ్యవహారాల్లో అవకతవకలు చేయడం, తన పేరుతో అప్పులు చేయడం వల్ల తీవ్రమైన ఆర్థిక ఒత్తిడికి లోనయ్యానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో (Social Media) తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా జరుగుతున్న ప్రచారంపై కూడా మేరీ కోమ్ స్పందించారు. తనను లోభి, స్వార్థపరురాలిగా చిత్రీకరిస్తున్నారని, కానీ తన జీవితంలో ఎదురైన కష్టాలు ఎవరికీ తెలియవని అన్నారు. వ్యక్తిగత అంశాలను వక్రీకరించి బయటకు లీక్ చేయడం వల్ల తాను అనవసర విమర్శలకు గురవుతున్నానని ఆమె వాపోయారు. అయితే ఈ ఆరోపణలను ఆమె మాజీ భర్త ఖండించారు.
ప్రస్తుతం ఫరీదాబాద్‌లో నివసిస్తున్న మేరీ కోమ్, నలుగురు పిల్లల భవిష్యత్తు మొత్తం తన భుజాలపైనే ఉందని చెప్పారు. తల్లిదండ్రుల బాధ్యత కూడా తనదేనని పేర్కొంటూ, పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా ఆగిపోవడానికి తనకు అవకాశం లేదన్నారు. ఎండార్స్‌మెంట్లు, వాణిజ్య కార్యక్రమాల ద్వారా మళ్లీ తన ఆర్థిక పరిస్థితిని బలపర్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. “నా జీవితం రింగ్‌లో Ring జరిగిన పోరాటాలతోనే ముగియలేదు. బయట కూడా ప్రతి రోజూ ఒక కొత్త మ్యాచ్‌ను ఎదుర్కొంటున్నాను. నేను వెనక్కి తగ్గను” అంటూ మేరీ కోమ్ ధైర్యంగా స్పందించారు. ఆమె మాటలు, క్రీడాకారిణిగా మాత్రమే కాకుండా జీవిత యోధురాలిగా ఆమెను మరోసారి గుర్తు చేశాయి.