Homeఅంతర్జాతీయంMarburg Hemorrhagic | ముంచుకొస్తున్న మరో ప్రాణాంతక వైరస్​.. ఆ దేశంలో విజృంభన!

Marburg Hemorrhagic | ముంచుకొస్తున్న మరో ప్రాణాంతక వైరస్​.. ఆ దేశంలో విజృంభన!

Marburg Hemorrhagic | వెనుక బడిన ఖండంగా పేర్కొనే ఆఫ్రికాలో మరో ప్రమాదకరమైన వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఎబోలా లాంటి ప్రమాదకరమైన వైరస్​గా భావిస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Marburg Hemorrhagic | వెనుక బడిన ఖండంగా పేర్కొనే ఆఫ్రికాలో మరో ప్రమాదకరమైన వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఎబోలా లాంటి ప్రమాదకరమైన వైరస్​గా భావిస్తున్నారు.

దక్షిణ సూడాన్ సరిహద్దుల్లో ఈ వైరస్​ వెలుగుచూసింది. ఈ వైరస్‌ను మార్బర్గ్ హెమరేజీగా ఇథియోపియా ప్రభుత్వం పేర్కొంటోంది.

Marburg Hemorrhagic | మూడు మరణాలు..

ఇథియోపియా దేశంలోని ఓమో అనే దక్షిణ ప్రదేశంలో ఈ వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. మొత్తం 17 అనుమానిత కేసులు వెలుగు చూశాయి. వీటిలో ముగ్గురు చనిపోయారు.

ప్రస్తుతం యాక్టివ్ కేసులు అయితే లేవు. కానీ, ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఆ దేశ సర్కారు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆఫ్రికా సీడీసీతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందాలు ఇథియోపియాకు చేరుకుని సహాయం అందిస్తున్నాయి.