అక్షరటుడే, నిజామాబాద్‌సిటీ: Railway Police | రైలులో ల్యాప్‌టాప్ చోరీ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు రైల్వే ఎస్‌హెచ్‌వో సాయిరెడ్డి (Railway SHO Sai Reddy) పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం వివరాలు వెల్లడించారు.
దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో (Devagiri Express) సోమవారం నాందేడ్ నుంచి సికింద్రాబాద్‌కు మాహారాష్ట్రకు చెందిన వ్యక్తి ల్యాప్‌టాప్‌తో ప్రయాణిస్తున్నాడు. అయితే అతడు నిద్రపోతున్న సమయంలో ఔరంగాబాద్‌కు చెందిన నదీం అనే వ్యక్తి ల్యాప్‌టాప్ చోరీ చేశాడు. అనంతరం బాసర రైల్వేస్టేషన్లో దిగి వెళ్లిపోయాడు. దీంతో బాధితుడు నిజామాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడి నుంచి ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకొని, నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
