అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Mamatha Mohan Das | ఒకప్పుడు టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న మమతా మోహన్ దాస్, ఇప్పుడు అంతగా తెలుగు తెరపై కనిపించకపోయినా, ఆమె పేరుకు మాత్రం ప్రత్యేక గుర్తింపు ఉంది.
‘యమదొంగ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మమతా, తన నటనతో పాటు గాత్రంతో కూడా ఆకట్టుకున్నారు. సింగర్‌గా కూడా మంచి పేరు తెచ్చుకున్న మమతా… కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో పోరాడి గెలిచిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె పాత ఇంటర్వ్యూలో చేసిన షాకింగ్ వ్యాఖ్యలు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోయిన్ నయనతారపై (Nayanthara) పరోక్ష విమర్శలు చేసినట్టు అంతా చర్చించుకుంటున్నారు.
Mamatha Mohan Das | నయన్‌పై కామెంట్స్..
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ఓ సినిమాకు సంబంధించి మమతా మాట్లాడుతూ.. “ఆ సినిమాలో ఓ పాట కోసం నన్ను ఎంపిక చేశారు. దాదాపు నాలుగు రోజుల పాటు సాంగ్ షూట్ చేశాం. కానీ షూటింగ్ సమయంలోనే నా ఫుటేజ్ మొత్తం తొలగించబడిందని అర్థమైంది. తెరపై నేను కేవలం ఒక్క షాట్‌లో మాత్రమే కనిపించాను, అదీ కూడా వెనుక నుంచి అని చెప్పారు. “సినిమాలో హీరోయిన్‌గా నటించిన వాళ్ల వల్లే నా సాంగ్ డిలీట్ అయింది. ఆమె షూటింగ్‌లో ఉంటే, నేను లొకేషన్‌కు రావద్దంటూ స్పష్టంగా చెప్పింది. ఆ కారణంగా నా పాత్ర పూర్తిగా తగ్గించబడింది,” అని చెప్పుకొచ్చారు.
అయితే హీరోయిన్ పేరు మాత్రం ఆమె చెప్పలేదు, కానీ ఆమె వ్యాఖ్యల ఆధారంగా ఇది 2008లో విడుదలైన రజనీ సినిమా “కథానాయకుడు” అని సినీ అభిమానులు అర్థం చేసుకుంటున్నారు. ఆ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించగా, మమతా ఒక స్పెషల్ సాంగ్‌లో కనిపించాల్సి ఉంది. మమతా నేరుగా నయనతార పేరు తీసుకురాలేదు. కానీ ఆమె చెప్పిన వివరాల ప్రకారం నయన్ గురించే ఆమె కామెంట్స్ చేసినట్టుగా సోషల్ మీడియా(Social Media)లో జోరుగా చర్చ జరుగుతోంది. మమతా చేసిన ఈ వ్యాఖ్యలపై నయనతార నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. సోషల్ మీడియాలో మాత్రం మమతా కామెంట్స్‌కు మద్దతుగా పలువురు కామెంట్లు పెడుతున్నారు. సీనియర్ నటులకు కూడా ఇలాంటి అనుభవాలు రావడం బాధాకరం. ముఖ్యంగా మహిళా నటుల మధ్య పాజిటివ్ సపోర్ట్ అవసరం అని రాసుకొస్తున్నారు.