అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Mallika Sherawat | బాలీవుడ్‌లో ఒకప్పుడు హాట్ బ్యూటీగా సంచలనం సృష్టించిన మల్లికా షెరావత్.. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. తెరపై బోల్డ్ పాత్రలు చేసిన ఈ నటి, వెనకటి రోజుల్లో ఇండస్ట్రీలో ఎదుర్కొన్న కష్టాలను మరోసారి బయటపెట్టింది.
క్యాస్టింగ్ కౌచ్‌పై (Casting Couch) మాట్లాడుతూ… రాజీకి ఒప్పుకోలేదనే కారణంతో తన చేతిలో సినిమా ఆఫర్స్ పూర్తిగా తగ్గిపోయాయని మల్లికా ఎమోషనల్‌గా చెప్పింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో మల్లికా షెరావత్ (Mallika Sherawat) మాట్లాడుతూ .. చాలా మంది పెద్ద హీరోలు రాత్రి సమయంలో కలవాలని అడిగేవారు. నేను ఎందుకు అలా వెళ్లాలి? తెరపై బోల్డ్‌గా నటించానని నిజ జీవితంలో కూడా అలా వ్యవహరించాలన్నట్లా? నేను ఆలా చేయను. వారి మాటలకు రాజీ పడలేదు” అని చెప్పింది.
Mallika Sherawat | నేను అలాంటి దాన్ని కాదు..
ఆమె వెల్లడించిన ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో (Social Media) మరోసారి వైరల్ అవుతున్నాయి. మల్లికా తన అభిప్రాయాన్ని స్పష్టం చేస్తూ.. నేను తెరపై బోల్డ్ సీన్స్ చేశానని… అనవసరంగా అలా అడగడం తప్పు. నేను ఆ టైప్ వ్యక్తిని కాదు. అందుకు ఒప్పుకోలేదని సినిమాలు తగ్గిపోయాయి. అయినప్పటికీ నన్ను నేను మార్చుకోలేదు” అని చెప్పింది. ఒకప్పటి బాలీవుడ్ హాట్ క్వీన్‌గా మల్లికా షెరావత్‌కి ఫుల్ క్రేజ్ ఉండేది. ఆమె అందం, బోల్డ్‌నెస్‌కి అప్పట్లో బోలెడంత క్రేజ్ ఉండేది. స్టార్ హీరోలతో డేటింగ్ చేసినట్టు వచ్చిన రూమర్లు కూడా తరచూ వైరల్ అయ్యేవి. బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించిన మల్లికా… ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉండి సోషల్ మీడియాలోనే యాక్టివ్‌గా ఉంటోంది.
ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా, ఎంత కాలం గ్యాప్ వచ్చినా… మల్లికా షెరావత్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో ఉంది. ఇప్పుడు ఆమె చేసిన ఈ బోల్డ్ కామెంట్స్ మరోసారి క్యాస్టింగ్ కౌచ్ చర్చలు హాట్ టాపిక్ అయ్యేలా చేశాయి. ప్రస్తుతం మల్లికా వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా… అనేక మంది మహిళా నటీమణులు ఇప్పటికీ ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె మరోసారి వెలుగులోకి తెచ్చిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
