అక్షరటుడే, ఇందూరు: Mla Dhanpal | నవరాత్రులను పురస్కరించుకొని భవానీ మాలధారులకు సోమవారం కొత్తగంజ్లో (Kothaganj) మహా అన్నదానం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal) హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందూ ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పే దేవీ నవరాత్రులు వైభవంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో బతుకమ్మ, దసరా పండుగలకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. అమ్మ వారి ఆశీర్వాదం ఇందూరు జిల్లా ప్రజలందరికీ ఉండాలని వేడుకున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ (Nizamabad Market Committee) ఛైర్మన్ ముప్పగంగారెడ్డి, మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కమల్ కిషోర్, కార్యదర్శి మల్లేష్, సలహాదారు మాస్టర్ శంకర్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.