Homeలైఫ్​స్టైల్​Back Pain | వెన్నునొప్పికి కారణం షూసేనా? తెలుసుకోవలసిన వాస్తవాలు ..

Back Pain | వెన్నునొప్పికి కారణం షూసేనా? తెలుసుకోవలసిన వాస్తవాలు ..

మన జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే వెన్నునొప్పితో చాలా మంది బాధపడుతుంటారు. నడవడం, వంగడం లేదా తిరగడం వంటి అనేక సాధారణ పనులకు వీపు బలం చాలా కీలకం.

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: Back Pain | మన జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే వెన్నునొప్పితో (back pain) చాలా మంది బాధపడుతుంటారు. నడవడం, వంగడం లేదా తిరగడం వంటి అనేక సాధారణ పనులకు వీపు బలం చాలా కీలకం. మీరు కూడా వెన్నునొప్పితో బాధపడుతున్నట్లయితే, మీ నొప్పికి కారణం కేవలం వెన్నెముక సమస్యలే (spinal problems) కాకుండా, మీరు ధరించే పాదరక్షలు (షూస్‌) కూడా కావచ్చు.

వెన్నునొప్పి-పాదరక్షల సంబంధం: అస్థిపంజరంలోని ఎముకలు అన్నీ ఒకదానికొకటి అనుసంధానించి ఉంటాయి. పాదాల దిగువ భాగంలో వచ్చే ఏ చిన్న మార్పు అయినా పైకి ప్రసరించి, చివరికి వెన్నెముక ఎముకలను ప్రభావితం చేస్తుంది. దీనిని వైద్య పరిభాషలో బయోమెకానికల్ సమస్య (biomechanical problem) అంటారు.

వైద్యుల సూచనల ప్రకారం, నడిచేటప్పుడు పాదాలు నేలను తాకినప్పుడు, అవి శరీరంలోని మిగిలిన భాగాలకు షాక్ అబ్జార్బర్‌లుగా పనిచేస్తాయి. సరైన మద్దతు లేని షూస్‌ ధరించడం వల్ల కీళ్లపై ఎక్కువ ఒత్తిడి పడి, అసహజమైన కదలికలు ఏర్పడతాయి. ఉదాహరణకు, హై హీల్స్ (high heels) వేసుకున్నప్పుడు శరీరం అసహజ స్థితిలో ఉండి, కీళ్లపై ఒత్తిడి పడుతుంది. మరోవైపు, బాగా మెత్తబడిన (Cushioned) షూస్‌ షాక్‌ను గ్రహించి, నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. పాదాలలో ఏ చిన్న సమస్య ఉన్నా, నడిచే విధానం మారిపోతుంది, ఇది కీళ్లపై అసమతుల్య ఒత్తిడిని సృష్టించి, నొప్పికి దారితీస్తుంది.

Back Pain | వివిధ రకాల పాదరక్షల ప్రభావం:

హై హీల్స్: ఇవి మీ నడక, వెన్నెముక అమరికను మారుస్తాయి. శరీరం బరువు కాలి వేళ్లపై కేంద్రీకృతమై, నడుము కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది.

ఫ్లాట్ షూస్: వంపు మద్దతు (Arch Support) లేని ఫ్లాట్ షూస్ (బ్యాలెట్ ఫ్లాట్‌లు) మోకాలు తుంటిపై ఒత్తిడిని పెంచడం ద్వారా వెన్ను సమస్యలకు దారితీయవచ్చు. అయితే, మంచి సపోర్ట్ ఉన్న ఫ్లాట్‌లు ఎంపిక చేసుకోవచ్చు

స్నీకర్లు లేదా అథ్లెటిక్ షూలు: సరైన కుషనింగ్ , మద్దతు ఉన్న అథ్లెటిక్ షూస్‌ నడుము నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తాయి. అయితే, అరిగిపోయిన స్నీకర్లు ధరించడం వలన గాయం ప్రమాదం పెరుగుతుంది. వాటిని 300 నుండి 500 మైళ్ల ఉపయోగం తర్వాత మార్చాలని సిఫార్సు చేస్తారు.

వెన్నునొప్పిని తగ్గించడంలో మీ పాదరక్షల పాత్రను తక్కువ అంచనా వేయవద్దు. అయినప్పటికీ, వెన్నునొప్పికి ఇతర కారణాలు (సయాటికా, హెర్నియేటెడ్ డిస్క్) కూడా ఉండవచ్చు .కాబట్టి, నొప్పి ఎక్కువగా ఉంటే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. సరైన షూస్‌ను ఎంచుకోవడం ద్వారా నొప్పి లేని జీవితాన్ని పొందవచ్చు.