HomeజాతీయంLinke Hoffmann Bush | ఇక జెట్​ స్పీడ్​.. ఆ రైళ్ల వేగం గంటకు 200...

Linke Hoffmann Bush | ఇక జెట్​ స్పీడ్​.. ఆ రైళ్ల వేగం గంటకు 200 కిలోమీటర్లు..!

Linke Hoffmann Bush | భారతీయ రైల్వే మౌలిక సదుపాయాల అప్​గ్రేడ్​పై దృష్టి సారించింది. రైలు ఇంజిన్లు, కోచ్‌లతోపాటు ట్రాక్‌లను సైతం నవీకరిస్తోంది. ఇందుకు రూ.లక్షల కోట్లు వెచ్చింది.

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: Linke Hoffmann Bush | భారతీయ రైల్వే మౌలిక సదుపాయాల అప్​గ్రేడ్​పై దృష్టి సారించింది. రైలు ఇంజిన్లు, కోచ్‌లతోపాటు ట్రాక్‌లను సైతం నవీకరిస్తోంది. ఇందుకు రూ.లక్షల కోట్లు వెచ్చింది.

ప్రయాణికులు త్వరగా వారి గమ్యస్థానాలకు చేరుకునేలా రైళ్ల సగటు వేగాన్ని పెంచాలని తాజాగా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పాత ICF (Integral Coach Factory) రైలు కోచ్‌ల స్థానంలో కొత్త LHB (Linke Hofmann Busch Coaches) కోచ్‌లను తీసుకొస్తోంది.

16 రైళ్లలో పాత ICF (ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) కోచ్‌లను ఆధునిక LHB (లింకే హాఫ్‌మన్ బుష్) కోచ్‌లతో భర్తీ చేయనున్నట్లు సెంట్రల్ రైల్వే (CR) తాజాగా ప్రకటించింది. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను స్టెయిన్‌లెస్ స్టీల్‌తో రూపొందిస్తారు. వీటిని భారత్​లోనే తయారు చేస్తారు.

Linke Hoffmann Bush | భద్రతకు ప్రాధాన్యం..

LHB కోచ్‌లు భద్రత, వేగానికి పేరుగాంచాయి. ప్రమాదం జరిగితే.. ఒక కోచ్ మరో కోచ్ పైకి ఎక్కకుండా.. నిరోధించే యాంటీ-క్లైంబింగ్ ఫీచర్స్‌ దీని ప్రత్యేకం. ఇందులో అగ్ని నిరోధక మెటీరియల్‌ను కూడా వినియోగిస్తారు. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు వేగం పరంగా ICF కోచ్‌ల కంటే మెరుగైనవి.

ఇక వేగం విషయానికి వస్తే.. పాత కోచ్‌ల గరిష్ట వేగం 140 kmph. LHB కోచ్‌ల గరిష్ట వేగం 160 kmph, బాడీ సామర్థ్యం 200 kmph వేగవంతమైన డిజైన్ కలిగి ఉంటుంది.

2030 నాటికి ఐసీఎఫ్ కోచ్‌లను దశల వారీగా తొలగించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. శతాబ్ది, రాజధాని, దురంతో తదితర రైళ్లు ఇప్పటికే ఎల్‌హెచ్‌బి కోచ్‌లతో నడుస్తున్నాయి. త్వరలో మరిన్ని జత కానున్నాయి.