Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | కోడలిని హత్య చేసిన అత్తకు జీవిత ఖైదు

Kamareddy | కోడలిని హత్య చేసిన అత్తకు జీవిత ఖైదు

కోడలిని పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసిన అత్తకు జీవిత ఖైదు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఇందుకు సంబందించిన వివరాలను పోలీసులు మంగళవారం వెల్లడించారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | కోడలిని పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసిన అత్తకు (mother-in-law ) జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా పోలీసులు మంగళవారం వివరాలు వెల్లడించారు.

నిజాంసాగర్ మండలం (Nizamsagar mandal) అచ్చంపేట గ్రామానికి చెందిన కీర్తన అదే గ్రామానికి చెందిన పండరిని 2021 మే 26న ప్రేమ వివాహం చేసుకుంది. వివాహం తర్వాత కీర్తన అత్త అంబవ్వ ప్రేమ వివాహం ఇష్టం లేక నిరంతరం కీర్తనను తిడుతూ, కొడుతూ వేధిస్తూ ఉండేది. ఈ బాధలు భరించలేక కీర్తన, పండరి ఇద్దరు హైదరాబాద్​లో (Hyderabad) కొన్ని రోజులు పని చేస్తూ జీవనం సాగించారు. అయితే పొలం పనుల నిమిత్తం ఇద్దరిని ఇంటికి పిలిచిన అంబవ్వ 2022 జులై 17న ఉదయం 9 గంటల ప్రాంతంలో కొడుకు, భర్త పొలం పనులకు వెళ్లగా కీర్తన పొయ్యి దగ్గర కూర్చుని ఉంది.

ఇదే సమయమని భావించిన అంబవ్వ కీర్తనను తిడుతూ ఇంట్లో మోటార్‌ సైకిల్‌ (motorcycle) నుంచి పెట్రోల్​ తీసుకుని కీర్తనపై చల్లి కట్టెతో నిప్పంటించి చంపడానికి ప్రయత్నించింది. మంటల్లో కాలుతున్న కీర్తన బయట ఇసుకలో పడి మంట ఆర్పివేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు వెంటనే ఆమెను బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి (Banswada Government Hospital) తీసుకెళ్లగా.. అక్కడి నుంచి నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి (Nizamabad Government Hospital) రిఫర్ చేశారు. అక్కడికి తరలించగా చికిత్స పొందుతూ కీర్తన మృతి చెందింది.

కీర్తన తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రేమ వివాహం ఇష్టంలేని అంబవ్వ కుమారునికి మరో పెళ్లి చేయాలన్న దురుద్దేశంతోనే కీర్తనను హత్య చేసినట్టు విచారణలో తేలింది. సాక్ష్యాధారాలు సేకరించిన పోలీసులు కోర్టు ముందుంచగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్ (Chief Judge Varaprasad) నిందితురాలు అంబవ్వకు జీవిత ఖైదుతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.