అక్షరటుడే, ఎల్లారెడ్డి: Leopard | ఎల్లారెడ్డి మండలం అన్నసాగర్ గ్రామ (Annasagar village) శివారు అటవీ ప్రాంతంలో మంగళవారం చిరుత సంచారం కలకలం రేపింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అన్నసాగర్ గ్రామానికి చెందిన రవీందర్, సురేందర్లకు చెందిన మేకల మందపై చిరుత దాడి చేయడంతో మూడు మేకలు మృతిచెందాయి. దీంతో బాధితులు తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఈ ఘటనతో పంట పొలాలకు వెళ్లాలంటే రైతులు జంకుతున్నారు. అటవీశాఖ అధికారులు (forest department officials) స్పందించి బోను ఏర్పాటు చేసి, చిరుత పట్టుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
