అక్షరటుడే, భీమ్గల్: Bheemgal | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలపై బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. శుక్రవారం మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు విపుల్ గౌడ్ పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు.
యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఆరెపల్లి నాగేంద్రబాబు, నియోజకవర్గ అధ్యక్షుడు సేపూర్ చరణ్ గౌడ్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) కేటీఆర్ అహంకారపూరితంగా మాట్లాడడం తగదన్నారు. వ్యక్తిగత విమర్శలు చేయడం కేటీఆర్‌కు అలవాటుగా మారిందని, తన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.