అక్షరటుడే, బాన్సువాడ : Banswada Congress | కాంగ్రెస్ పార్టీ (Congress Party) ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంటే, బీఆర్ఎస్ నాయకులు నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు సయ్యద్ మన్సూర్ ఆరోపించారు. బాన్సువాడ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) దిష్టిబొమ్మను దహనం చేశారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఆయన అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బీఆర్ఎస్ నాయకులకు తగదని అన్నారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి వ్యక్తిగత విమర్శలతో రాజకీయాలు చేయడం కేటీఆర్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. కేటీఆర్ తన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ తిరుమల రెడ్డి, అబ్దుల్ మొయిస్, సోషల్ మీడియా కన్వీనర్ సయ్యద్ ఇలియాస్, యువ నాయకులు సయ్యద్ గౌస్, అతిక్, రఫత్, భూపతి, ఎజాజ్, ఫేజ్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.