అక్షరటుడే, హైదరాబాద్: KTR and YS Jagan | ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, భారాస కార్య నిర్వాహక అధ్యక్షుడు ఒకే వేదికపై తారసపడ్డారు. బెంగళూరులో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ అధినేత, బీఆర్ఎస్ అగ్రనేత కలయిక.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర రాజకీయ చర్చకు దారితీసింది.
బెంగళూరులో శనివారం సాయంత్రం జరిగిన ఓ కార్యక్రమానికి ఈ ఇద్దరు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్, కేటీఆర్ పక్కపక్కనే కూర్చొన్నారు. సరదాగా కాసేపు ముచ్చటించుకున్నారు. కాగా, వీరిద్దరూ పక్క పక్కనే కూర్చుని ముచ్చటించుకుంటున్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
KTR and YS Jagan | కేసీఆర్పై జగన్ ప్రశంసల జల్లు..
తెలంగాణలో గత సీఎం కేసీఆర్ పాలనపై, హైదరాబాద్ అభివృద్ధిపై ఇటీవల వైఎస్ జగన్ ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటీకి రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగతం అని, రాజకీయాలకు సంబంధం లేదని ఇరు పార్టీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి.
బెంగళూరులో జగన్, కేటీఆర్ ఆత్మీయ కలయిక
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బెంగళూరులో ఒకే వేదికపై కలుసుకోవడం తెలుగు రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. బెంగళూరులో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వీరిద్దరూ హాజరయ్యారు. pic.twitter.com/wRsZm9wAcY
— vm_updates (@VijayMarka88) November 22, 2025
