అక్షరటుడే, వెబ్‌డెస్క్: Minister Komatireddy | కాంగ్రెస్ అధిష్టానం ఇటీవల కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులను నియమించిన విషయం తెలిసిందే. అయితే పలువురు డీసీసీ అధ్యక్షుల ఎంపికపై (DCC president selections) ఎమ్మెల్యేలు, మంత్రులు అసంతృప్తితో ఉన్నారు. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డీసీసీ అధ్యక్షుడిని మార్చాలన్నారు.
నల్గొండ డీసీసీ అధ్యక్షుడిగా (Nalgonda DCC president) ఇటీవల కాంగ్రెస్ పార్టీ పున్నా కైలాష్ నేతను ఎంపిక చేసింది. ఆయన ఎంపికపై మంత్రి కోమటిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. గతంలో తనను, తన కుటుంబాన్ని కైలాష్ అసభ్య పదజాలంతో దూషించాడని లేఖలో పేర్కొన్నారు. డీసీసీ అధ్యక్ష పదవికి ఆయన అర్హుడు కాదని చెప్పారు. అతడిని తొలగించాలని డిమాండ్ చేశారు. మరోవైపు డీసీసీ అధ్యక్షుడు కైలాష్‌కు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) మద్దతు తెలపడం గమనార్హం.
Minister Komatireddy | సంగారెడ్డిలో..
రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కాంగ్రెస్ అధ్యక్షులను నియమించింది. కానీ సంగారెడ్డిని మాత్రం పక్కన పెట్టింది. అక్కడ ప్రస్తుతం జగ్గారెడ్డి (Jagga Reddy) సతీమణి నిర్మలరెడ్డి అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. నారాయణఖేడ్‌కు చెందిన ఓ యువ నాయకుడు అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అయితే పలువురు నేతలు అడ్డుకోవడంతో నియామక ప్రక్రియ ఆగిపోయినట్లు తెలుస్తోంది.
Minister Komatireddy | ఒక్కరికే మూడు పదవులు
యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri district) అధ్యక్ష పదవిని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకు ఇవ్వడం గమనార్హం. పలువురు సీనియర్ నేతలు ఈ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇప్పటికే రెండు పదవులు ఉన్న బీర్ల ఐలయ్యను డీసీసీ ప్రెసిడెంట్ చేయడంపై పార్టీలోని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.
