KGF Villain | చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం.. కేజీఎఫ్ విల‌న్ హ‌ఠాన్మ‌ర‌ణం..

అక్షరటుడే, వెబ్​డెస్క్: KGF Villain | ఇటీవ‌ల చిత్ర ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన ప‌లువురు ప్ర‌ముఖుల మ‌ర‌ణ వార్త‌లు ఎక్కువ‌గా వింటున్నాం. తాజాగా కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు దినేష్ మంగళూరు (Dinesh Mangalore) ఇకలేరు. 55 సంవత్సరాల వయస్సులో, ఆగస్ట్ 25న ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, కర్నాటక రాష్ట్రంలోని (Karnataka State) ఉడుపి జిల్లా కుందాపురలో గల తన నివాసంలోనే మృతిచెందినట్లు తెలుస్తోంది. దినేష్ తన నట జీవితాన్ని […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: KGF Villain | ఇటీవ‌ల చిత్ర ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన ప‌లువురు ప్ర‌ముఖుల మ‌ర‌ణ వార్త‌లు ఎక్కువ‌గా వింటున్నాం. తాజాగా కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు దినేష్ మంగళూరు (Dinesh Mangalore) ఇకలేరు. 55 సంవత్సరాల వయస్సులో, ఆగస్ట్ 25న ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, కర్నాటక రాష్ట్రంలోని (Karnataka State) ఉడుపి జిల్లా కుందాపురలో గల తన నివాసంలోనే మృతిచెందినట్లు తెలుస్తోంది. దినేష్ తన నట జీవితాన్ని రంగస్థల నాటకాలతో ప్రారంభించారు. ఆ తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టి, ఆర్ట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. ‘నెం.73 శాంతినివాస’ వంటి చిత్రాలకు ఆయన ఆర్ట్ డైరెక్షన్ చేశారు. కానీ, నటుడిగా ఆయనకు పెద్ద గుర్తింపు తెచ్చిన సినిమా ‘ఆ దినగళు’.

KGF Villain | ప్ర‌ముఖుల నివాళులు..

దర్శకుడు కె.ఎం.చైతన్య తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆయన పోషించిన సీతారామ్ శెట్టి పాత్రకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. ఆ తరువాత ఆయన ‘ఉలిదవరు కందంటే’, ‘కిచ్చా’, ‘కిరిక్ పార్టీ’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. అయితే, అతనికి దేశవ్యాప్తంగా గుర్తింపును తీసుకువచ్చిన సినిమా ‘కేజీఎఫ్’. ఈ చిత్రంలో దినేష్ పోషించిన బాంబే డాన్ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది. దినేష్ మంగళూరుకు ‘కాంతారా’  సినిమా షూటింగ్ సమయంలో స్ట్రోక్ బారిన ప‌డ్డారు. అప్పుడు బెంగళూరులో చికిత్స పొందిన తర్వాత క్ర‌మంగా కోలుకున్నారు. అయితే వారం క్రితం ఆయన మళ్లీ అనారోగ్యానికి గురైన ఆయ‌న‌ అంకడకట్టే సర్జన్ ఆసుపత్రిలో (Ankadakatte Surgeon Hospital) చికిత్స పొందుతూ క‌న్నుమూశారు.

దినేష్ మృతిపై సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నటుడు చేతన్ కుమార్ అహింస తన సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తూ.. “ఆ దినగళు సినిమాలో ఆయనతో కలిసి పనిచేసిన రోజుల్ని గుర్తు చేసుకుంటున్నాను. ఆయన పోషించిన పాత్ర ఆ సినిమాకే బలంగా నిలిచింది. ఆయన కృషి చిరస్మరణీయం” అని వ్యాఖ్యానించారు. దినేష్‌కు భార్య భారతి, ఇద్దరు కుమారులు పవన్ మరియు సజ్జన్ ఉన్నారు. దినేష్‌ అంత్యక్రియలు మంగళవారం జరగనున్నాయి.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.