అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kavitha Janam Bata | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో వనపర్తి పెద్దగా అభివృద్ధి చెందలేదన్నారు. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి (Former Minister Niranjan Reddy) భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
కవిత జాగృతి జనంబాట (Kavitha Janam Bata) కార్యక్రమంలో భాగంగా సోమవారం వనపర్తి జిల్లాలో పర్యటించారు. కొత్తకోటలో ఆమె మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి మూడు, నాలుగు ఫాంహౌస్‌లు కట్టుకున్నారని ఆరోపించారు. భారీగా అవినీతికి పాల్పడ్డారన్నారు. నియోజకవర్గంలో గతంలో రాచరిక పాలన సాగిందని విమర్శించారు.
Kavitha Janam Bata | తాట తీస్తా..
తన గురించి మాట్లాడితే తాట తీస్తానని నిరంజన్‌రెడ్డిని కవిత హెచ్చరించారు. ఆయన తన తండ్రి వయసు వారు కావడంతో ఇన్నాళ్లు గౌరవించానని చెప్పారు. కానీ తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. తనను ఉద్దేశించి పుచ్చువంకాయ, సచ్చు వంకాయ అని మాట్లాడుతున్నారని, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోతుందని వార్నింగ్ ఇచ్చారు.
Kavitha Janam Bata | హరీశ్‌రావు మనిషి
నిరంజన్‌రెడ్డి అవినీతి గురించి మాజీ సీఎం కేసీఆర్ (Former CM KCR)కు తెలియదని తాను అనుకుంటున్నట్లు కవిత తెలిపారు. ఈ అవినీతి కేసీఆర్ వరకు వెళ్లకుండా హరీశ్ రావు (Harish Rao) కాపాడారా అన్నారు. అలాంటి నాయకులను ప్రజలమీద రుద్ది ఇబ్బంది పెట్టడం ఎందుకని ప్రశ్నించారు. ఆయన లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదన్నారు. నిరంజన్‌రెడ్డి ఎంతో మందిపై కేసులు పెట్టి వేధించారని ఆరోపించారు. ఆయన హరీశ్‌రావు మనిషి కావడంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు.
