36
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Job Opportunities | నాగ్‌పూర్‌లోని ప్రభుత్వ రంగ మినీ రత్న సంస్థ (Mini Ratna company) అయిన మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్ (Manganese Ore India Limited) పలు పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయడానికి చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైనవారినుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్ వివరాలిలా ఉన్నాయి.
- భర్తీ చేసే పోస్టుల సంఖ్య : 67
- పోస్టుల వారీగా వివరాలు..
- గ్రాడ్యుయేట్ ట్రైనీ : 49, మేనేజ్‌మెంట్ ట్రైనీ : 15, మేనేజర్ : 03.
- భర్తీ చేసే విభాగాలు : మైనింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, జియాలజీ, ప్రాసెస్, మెటీరియల్స్, మార్కెటింగ్ సిస్టమ్.
- విద్యార్హతలు : పోస్టుననుసరించి బీఈ/బీటెక్, ఎంటెక్, గ్రాడ్యుయేట్, ఎంబీఏ, డిప్లొమా/పీజీ డిప్లొమా, పీజీ ఉత్తీర్ణత. ఉద్యోగానుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
- వయో పరిమితి : గ్రాడ్యుయేట్ ట్రైనీ, మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు 30 ఏళ్లు, మేనేజర్ పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు. వయో పరిమితిని ఈ ఏడాది జనవరి 20 నాటికి లెక్కలోకి తీసుకుంటారు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 నుంచి 13 ఏళ్ల వరకు సడలింపు ఇస్తారు.
- వేతనం వివరాలు : గ్రాడ్యుయేట్ ట్రైనీ, మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు నెలకు రూ. 40 వేలనుంచి 1.40 లక్షల వరకు, మేనేజర్ పోస్టుకు రూ. 50 వేలనుంచి రూ. 1.60 లక్షల వరకు ఉంటుంది.
- దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా..
- దరఖాస్తు గడువు : జనవరి 20.
- దరఖాస్తు రుసుము : జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ. 590 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
- ఎంపిక విధానం : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు.
- పూర్తి వివరాలకు https://moil.nic.in/ వెబ్‌సైట్‌లో సంప్రదించండి.