అక్షరటుడే, న్యూఢిల్లీ: Jan 12 market Analysis | గ్లోబల్ మార్కెట్‌లు(Global markets) పాజిటివ్‌గా ఉన్నాయి. అయితే ఇరాన్‌లో చెలరేగిన నిరసనలతో చమురు సరఫరాకు అంతరాయం కలగవచ్చన్న ఆందోళనతో క్రూడ్ ఆయిల్ ధరలకు(Crude oil prices) రెక్కలొచ్చాయి. మరోవైపు ట్రంప్ టారిఫ్ భయాలు దేశీయ స్టాక్ మార్కెట్‌ను ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం మన మార్కెట్లు బలహీనంగా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Jan 12 market Analysis | యూఎస్ మార్కెట్లు..
గత సెషన్‌లో నాస్‌డాక్(Nasdaq) 0.86 శాతం, ఎస్‌అండ్‌పీ 0.65 శాతం పెరగ్గా.. సోమవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.33 శాతం నష్టంతో ఉంది.
Jan 12 market Analysis | యూరోప్ మార్కెట్లు..
సీఏసీ 1.42 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.79 శాతం, డీఏఎక్స్(DAX) 0.53 శాతం లాభపడ్డాయి.
Jan 12 market Analysis | ఆసియా మార్కెట్లు..
ఉదయం 8 గంటల ప్రాంతంలో ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాలతో సాగుతున్నాయి. జపాన్‌కు చెందిన నిక్కీ(Nikkei) 1.58 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 1.21 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.94 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.51 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్(HangSeng) 0.29 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.27 శాతం లాభంతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.09 శాతం నష్టంతో సాగుతోంది. మన మార్కెట్లు గ్యాప్‌డౌన్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని ఇది సూచిస్తోంది.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్‌ఐఐ(FII)లు వరుసగా ఐదో సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 3,769 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. డీఐఐలు వరుసగా 94వ రోజు నికర కొనుగోలుదారులుగా ఉండి రూ. 5,595 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 0.66 నుంచి 0.62 కు తగ్గింది. ఇది మార్కెట్‌పై బేర్స్ ఆధిపత్యాన్ని సూచిస్తోంది. పీసీఆర్ 0.7 దాటితేనే మార్కెట్‌లో బేరిష్ సెంటిమెంట్ తగ్గుతుంది.
- విక్స్(VIX) గత సెషన్‌లో 3.07 శాతం పెరిగి 10.93 కి చేరింది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 13 పైసలు బలహీనపడి 90.17 వద్ద నిలిచింది.
- యూఎస్ పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.18 శాతం వద్ద, డాలర్ ఇండెక్స్ 98.95 వద్ద కొనసాగుతున్నాయి.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 63.25 డాలర్లకు చేరింది.
- ఈ వారంలో భారత్, యూఎస్ ద్రవ్యోల్బణ డాటాలు విడుదల కానున్నాయి. దీంతోపాటు ఇదే వారంలో ప్రారంభమయ్యే మన కంపెనీల మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు దేశీయ స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని భావిస్తున్నారు.