అక్షరటుడే, న్యూఢిల్లీ: Jan 12 Gold Prices | బంగారం, వెండి ధరలు Silver Prices రోజురోజుకీ సామాన్యుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ప్రస్తుతం బంగారం కొనాలంటేనే చాలా మంది భయపడే పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు బంగారం ధరలే వేగంగా పెరిగేవి కానీ ఇప్పుడు వెండి కూడా దానికి రెట్టింపు వేగంతో దూసుకుపోతోంది. దీనికి ప్రధాన కారణం ఎలక్ట్రిక్ పరికరాలు, ఈవీ వాహనాల తయారీలో వెండి వినియోగం భారీగా పెరగడమే. మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు పెద్ద ఎత్తున అందుబాటులోకి రావడం, తయారీ రంగం ఊపందుకోవడంతో వెండికి డిమాండ్ భారీగా పెరిగింది. మరోవైపు బంగారం ధర నిన్నటితో పోలిస్తే తులంపై కేవలం పది రూపాయల మేర మాత్రమే తగ్గింది. ఈ స్వల్ప తగ్గింపు వినియోగదారులకు పెద్దగా ఊరటనివ్వడం లేదు.
Jan 12 Gold Prices | స్వల్ప తగ్గుదల
ఒక రోజు కాస్త తగ్గినట్టే కనిపించినా.. మరుసటి రోజే అంతకంటే ఎక్కువగా పెరుగుతుండటంతో ధరలపై ఆందోళన మరింత పెరుగుతోంది. జనవరి 12వ తేదీన దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే..
- హైదరాబాద్‌లో Hyderabad 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,450గా – 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,28,740గా కొనసాగుతోంది. విజయవాడలోనూ ఇదే ధరలు నమోదయ్యాయి.
- ఢిల్లీలో మాత్రం బంగారం ధరలు కాస్త ఎక్కువగా ఉండగా, అక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,600గా – 22 క్యారెట్ల ధర రూ.1,28,890గా ఉంది.
- ముంబై, బెంగళూరులో Bangalore 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,450గా – 22 క్యారెట్ల ధర రూ.1,28,740గా కొనసాగుతోంది.
- చెన్నైలో సాధారణంగా బంగారం ధరలు ఎక్కువగా ఉండేవి కానీ ఈసారి అక్కడ కాస్త తగ్గుదల కనిపిస్తోంది. అక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,640గా – 22 క్యారెట్ల ధర రూ.1,28,990గా ఉంది.
ఇక వెండి ధరల విషయానికి వస్తే, అవి కూడా అతి స్వల్పంగా మాత్రమే తగ్గాయి. కిలో వెండిపై కేవలం రూ.100 తగ్గుదల నమోదైంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,74,900గా ఉండగా, ఇతర నగరాల్లో సగటున రూ.2,59,900 వద్ద కొనసాగుతోంది. రోజూ మారుతున్న ఈ ధరలను తెలుసుకోవాలనుకునే వారు తమ మొబైల్ ఫోన్‌లో కూడా బంగారం రిటైల్ ధరలను తనిఖీ చేయవచ్చు.