అక్షరటుడే, హైదరాబాద్: Jan 10 Gold Prices | సామాన్య ప్రజలకు బంగారం ధరలు Gold Rates షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నాయి. గత రెండు మూడు రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు కొనుగోలుదారులకు కాస్త ఊరటనిచ్చినప్పటికీ, శనివారం ఒక్కసారిగా పెరగడంతో మళ్లీ ఆందోళన నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య అనిశ్చితులు బంగారం ధరలపై నేరుగా ప్రభావం చూపుతున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. భారత్‌పై అమెరికా టారిఫ్‌లు విధిస్తామనే హెచ్చరికలు, అమెరికా–వెనిజులా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు, గ్లోబల్ ఆర్థిక పరిస్థితుల్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావించడంతో ధరల్లో ఈ హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయని అభిప్రాయపడుతున్నారు.
Jan 10 Gold Prices | మళ్లీ పెరుగుదల..
తాజా మార్కెట్ మార్పుల అనంతరం తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో Hyderabad 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన తులం బంగారం ధర రూ.1,39,320గా కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.1,39,310గా ఉండగా, ఒక్క రోజులోనే స్వల్ప పెరుగుదల నమోదైంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.1,27,771గా ఉంది. నిన్న ఈ ధర రూ.1,27,700 వద్ద స్థిరపడింది.
విజయవాడలో కూడా 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,320గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,27,771 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలోనూ ఇదే ధరలు అమల్లో ఉండటంతో తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల్లో బంగారం ధరలు దాదాపు సమానంగా కొనసాగుతున్నాయి.
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లోనూ బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,650 వద్ద కొనసాగుతుండగా, నిన్న ఈ ధర రూ.1,39,640గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.1,28,010గా ఉండగా, నిన్న రూ.1,28,000గా నమోదైంది.
బెంగళూరులో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,39,320గా కొనసాగుతుండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,27,771 వద్ద ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,470గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,27,860గా కొనసాగుతోంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,320గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,27,771 వద్ద స్థిరంగా ఉంది.
ప్రధాన మెట్రో నగరాల్లో ధరల్లో పెద్దగా తేడా లేకపోయినా, స్థానిక పన్నులు, డిమాండ్–సరఫరా పరిస్థితుల కారణంగా స్వల్ప వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. బంగారంతో పాటు వెండి ధరల్లోనూ Silver మార్పులు చోటు చేసుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కేజీ వెండి ధర ప్రస్తుతం రూ.2,48,900గా ఉండగా, నిన్న ఈ ధర రూ.2,49,000గా నమోదైంది.
హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2,67,900గా కొనసాగుతుండగా, నిన్న ఈ ధర రూ.2,67,800 వద్ద స్థిరపడింది. చెన్నైలో కేజీ వెండి ధర రూ.2,67,900గా ఉండగా, బెంగళూరులో కేజీ వెండి ధర రూ.2,48,900గా కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం, పారిశ్రామిక డిమాండ్‌లో మార్పులు, డాలర్ మారకం విలువల ప్రభావంతో వెండి ధరల్లోనూ ఈ హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నారు.