అక్షరటుడే, న్యూఢిల్లీ: Jan 09 Market Analysis | రష్యా ఆయిల్ (Russian oil) కొనుగోలు చేసే దేశాలపై 500 శాతం సుంకాలను విధించడానికి ట్రంప్ తీసుకుంటున్న చర్యలతో స్టాక్ మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. గత సెషన్‌లో యూఎస్, యూరోపియన్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ముగియగా.. ఆసియాలోని ప్రధాన స్టాక్ మార్కెట్లు మాత్రం పాజిటివ్ (Positive) గా ఉన్నాయి. మన మార్కెట్లు గ్యాప్‌అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని గిఫ్ట్ నిఫ్టీ (Gift nifty) సంకేతాలిస్తోంది.
Jan 09 Market Analysis | యూఎస్ మార్కెట్లు..
ఎస్‌అండ్‌పీ 0.34 శాతం 0.01 శాతం పెరగ్గా.. గత సెషన్‌లో నాస్‌డాక్(Nasdaq) 0.43 శాతం నష్టపోయింది. శుక్రవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.11 శాతం లాభంతో ఉంది.
Jan 09 Market Analysis | యూరోప్ మార్కెట్లు..
సీఏసీ 0.12 శాతం, డీఏఎక్స్(DAX) 0.22 శాతం లాభపడగా.. ఎఫ్‌టీఎస్‌ఈ 0.04 శాతం నష్టపోయింది.
Jan 09 Market Analysis | ఆసియా మార్కెట్లు..
ఉదయం 8 గంటల ప్రాంతంలో సౌత్‌కొరియా మార్కెట్ మినహా మిగిలిన ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో సాగుతున్నాయి. జపాన్‌కు చెందిన నిక్కీ (Nikkei) 1.13 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.70 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 0.36 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ (HangSeng) 0.14 శాతం లాభంతో ఉన్నాయి. తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.48 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.04 శాతం నష్టాలతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.11 శాతం లాభంతో సాగుతోంది. మన మార్కెట్లు గ్యాప్‌అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని ఇది సూచిస్తోంది.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్‌ఐఐలు వరుసగా నాలుగో సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 3,367 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. డీఐఐ(DII)లు వరుసగా 93వ రోజు నికర కొనుగోలుదారులుగా ఉండి రూ. 3,701 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 0.89 నుంచి 0.66 కు తగ్గింది. పీసీఆర్ 0.7 కిందకు వెళ్లడం మార్కెట్‌లో బేరిష్ మూడ్‌కు సంకేతం.
- విక్స్(VIX) గత సెషన్‌లో 6.53 శాతం పెరిగి 10.06 కు చేరింది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 14 పైసలు బలహీనపడి 90.03 వద్ద నిలిచింది.
- యూఎస్ పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.18 శాతం వద్ద, డాలర్ ఇండెక్స్ 98.98 వద్ద కొనసాగుతున్నాయి.
- వెనిజువెలా, ఇరాన్ పరిణామాలతో క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతోంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.71 శాతం పెరిగి 62.43 డాలర్లకు చేరింది.
- ట్రంప్ విధించిన రెసిప్రోకల్ టారిఫ్స్ హేతుబద్ధత విషయంలో ఈరోజు (శుక్రవారం) అక్కడి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ తీర్పు కోసం ఇన్వెస్టర్లు వేచి చూస్తున్నారు. రెసిప్రోకల్ టారిఫ్స్‌కు వ్యతిరేకంగానే తీర్పు వచ్చే అవకాశాలున్నాయన్న అభిప్రాయం అనలిస్టుల్లో వ్యక్తమవుతోంది.
