అక్షరటుడే, హైదరాబాద్: Jan 09 Gold Prices | గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు Silver Prices ఊహించని స్థాయిలో భారీగా పెరుగుతూ వచ్చిన విషయం తెలిసిందే. కొన్ని సందర్భాల్లో ఒక్కరోజులోనే వేల రూపాయల మేర బంగారం ధరలు పెరగడం వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేసింది.
ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా అమెరికా–వెనిజులా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు. వెనిజులా సంక్షోభంతో ఏర్పడిన భౌగోళిక రాజకీయ అనిశ్చితి కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత సాధనాలైన బంగారం, వెండి, రాగి వంటి కమొడిటీల వైపు మొగ్గుచూపడమేనని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ భారీ పెరుగుదల అనంతరం గత రెండు రోజులుగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.
Jan 09 Gold Prices | తగ్గిన ధరలు..
తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని ప్రధాన నగరాల్లో శుక్రవారం ఉదయం 6 గంటల సమయానికి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
- హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,37,990గా ఉంది. నిన్న ఇదే ధర రూ.1,38,260గా నమోదైంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.1,26,490గా ఉండగా, నిన్న ఈ ధర రూ.1,26,740గా ఉంది.
- విజయవాడలో కూడా 24 క్యారెట్ల బంగారం రూ.1,37,990గా, 22 క్యారెట్ల బంగారం రూ.1,26,490గా కొనసాగుతోంది. వైజాగ్‌లోనూ ఇదే ధరలు కొనసాగడం గమనార్హం.
దేశవ్యాప్తంగా ఇతర ప్రధాన నగరాల విషయానికి వస్తే..
- చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,080గా ఉండగా, నిన్న ఈ ధర రూ.1,39,630గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతం రూ.1,27,490గా ఉండగా, నిన్న రూ.1,27,900గా నమోదైంది.
- బెంగళూరులో Bangalore 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,37,990గా , 22 క్యారెట్ల బంగారం రూ.1,26,490గా కొనసాగుతోంది.
- దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,38,140గా ఉండగా , 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,26,640గా ఉంది.
- ముంబైలోనూ 24 క్యారెట్ల బంగారం రూ.1,37,990గా, 22 క్యారెట్ల బంగారం రూ.1,26,490గా కొనసాగుతోంది.
ఇక వెండి ధరల విషయానికి వస్తే..
- దేశ రాజధాని ఢిల్లీలో Delhi కేజీ వెండి ధర రూ.2,51,900గా ఉంది. నిన్న ఈ ధర రూ.2,57,100గా నమోదైంది.
- హైదరాబాద్‌లో కేజీ వెండి ధర ప్రస్తుతం రూ.2,71,900గా ఉండగా, నిన్న రూ.2,77,100గా ఉంది.
- చెన్నైలో కేజీ వెండి ధర రూ.2,71,900 వద్ద కొనసాగుతుండగా, బెంగళూరులో కేజీ వెండి ధర రూ.2,51,900గా కొనసాగుతోంది.
మొత్తంగా చూస్తే గతంలో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం స్వల్పంగా తగ్గినప్పటికీ ఇంకా భారీ స్థాయిల్లోనే కొనసాగుతుండటంతో పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు మార్కెట్ పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తున్నారు.