అక్షరటుడే, వెబ్‌డెస్క్ : YS Jagan | నేటి (సెప్టెంబర్ 22) నుంచి అమల్లోకి రానున్న కొత్త జీఎస్టీ స్లాబులు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వేళ, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) మోహన్ రెడ్డి దీనిపై స్పందించటం రాజకీయంగా ఆసక్తికర పరిణామంగా మారింది.
జీఎస్టీ పునర్నిర్మాణాన్ని అభినందించిన జగన్ వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. జీఎస్టీపై స్పందించిన జగన్.. GST పునర్నిర్మాణం అనేది ఒక సరళమైన, నిష్పక్షికమైన పన్ను వ్యవస్థ దిశగా విప్లవాత్మక అడుగు. ప్రతి పౌరుడికి వస్తువులు, సేవలు మరింత సరళంగా, అందుబాటులోకి వచ్చేలా చేయడమే లక్ష్యం,” అని అన్నారు.
YS Jagan | జగన్ ట్వీట్ హాట్ టాపిక్..
ఈ కొత్త విధానం ద్వారా చివరి వినియోగదారుడికి కూడా ప్రయోజనాలు చేరతాయని ఆశిస్తున్నాను. కొన్ని లోపాలు, ఫిర్యాదులు ఉండొచ్చుగానీ, ఇది ఆర్థిక వ్యవస్థకు అవసరమైన బూస్ట్‌ను ఇస్తుంది,” అని అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రధానంగా మోదీ(PM Modi) ప్రభుత్వాన్ని ప్రశంసించేలా ఉండటంతో, రాజకీయంగా ఇది తీవ్రంగా చర్చకు దారితీసింది. ప్రస్తుతం ఏపీలో ఎన్డీఏ NDA కూటమి అధికారంలో ఉండగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party) ప్రతిపక్షంలో ఉంది. అయినా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై జగన్ ఇలాంటీ సానుకూల వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో కసరత్తుకి దారి తీస్తోంది.
ఇప్పటికే ఇటీవల జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్‌కు వైసీపీ మద్దతు ఇవ్వడం విశేషమే. ఇప్పుడు GSTపై సానుకూలమైన స్పందనను కూడా జగన్ చూపడం ఏపీ రాజకీయ వర్గాల్లో అనేక రకాల ఊహాగానాలకు కారణమవుతోంది. ఈ వ్యాఖ్యలపై ఎన్డీఏ ప్రభుత్వ ప్రతినిధులు ఎలా స్పందిస్తారు? జగన్ వ్యాఖ్యల వెనుక రాజకీయ వ్యూహం ఉందా? కేంద్రంతో వైసీపీకి ఏమైనా పొత్తు రాజకీయాలు రాబోతున్నాయా? అనే ప్రశ్నలు ఇప్పుడు వేడెక్కుతున్నాయి. ఒకవైపు అధికార టీడీపీ నేతలు, మరోవైపు వైసీపీ శ్రేణులు ..ఇరువర్గాలు ఈ వ్యాఖ్యలను తమదైన కోణంలో విశ్లేషించడం ప్రారంభించాయి. మొత్తం మీద, జగన్ జీఎస్టీపై చేసిన ప్రశంసల ఫోస్ట్ ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికర మలుపు తీసుకుంది. రానున్న రోజుల్లో ఇది మరింత చర్చనీయాంశమవనుంది.
