Homeతాజావార్తలుIT Raids | హైదరాబాద్​లో కొనసాగుతున్న ఐటీ సోదాలు

IT Raids | హైదరాబాద్​లో కొనసాగుతున్న ఐటీ సోదాలు

హైదరాబాద్​ నగరంలో ఐటీ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ప్రముఖ హోటళ్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో అధికారులు తనిఖీలు చేపడుతున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IT Raids | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ఐటీ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. నగరంలోని పలు ప్రముఖ హోటళ్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో మంగళవారం అధికారులు తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే బుధవారం సైతం సోదాలు నిర్వహిస్తున్నారు.

నగరంలోని పిస్తా హౌజ్ (Pistachio House)​, షా గౌస్​, మైహిఫిల్​ హోటళ్ల (Mehfil Hotels) నిర్వాహకుల ఇళ్లలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ హోటళ్లకు చాలా బ్రాంచ్​లు ఉన్నాయి. ప్రతి ఏటా వందల కోట్ల వ్యాపారాలు చేస్తున్నాయి. అయితే ఆదాయ పన్ను చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. రాజేంద్రనగర్​లోని (Rajendranagar) పిస్తా హౌస్ ఓనర్లు మహమ్మద్ మజీద్, మహమ్మద్ అబ్దుల్ మోషీ ఇళ్లలో రెండు రోజులుగా తనిఖీలు చేస్తున్నారు. అలాగే హోటల్​ వర్కర్లకు సంబంధించిన నివాసాల్లో సైతం పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్ డిస్క్​లు సీజ్​ చేశారు.

IT Raids | వ్యాపారుల్లో కలవరం

నగరంలో ఇటీవల వరుసగా ఐటీ దాడులు (IT Raids) జరుగుతుండడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. గతంలో బంగారు వర్తకులకు సంబంధిన దుకాణాలు, ఇళ్లలో పెద్ద ఎత్తున సోదాలు చేపట్టారు. తాజాగా హోటళ్లపై రైడ్​ సాగుతోంది. మంగళవారం ఏకకాలంలో 30 బృందాలు సోదాలు చేపట్టాయి. బుధవారం సైతం తనిఖీలు కొనసాగుతున్నాయి. అయితే చాలా మంది వ్యాపారులు పన్నులు సక్రమంగా చెల్లించకుండా తప్పించుకుంటున్నారు. తాజా ఐటీ దాడులతో వారు కలవరం చెందుతున్నారు. తమపై ఎక్కడ రైడ్​ అవుతుందోనని ఆందోళన చెందుతున్నారు.