అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IT Raids | హైదరాబాద్ నగరంలో మరోసారి ఐటీ అధికారులు సోదాలు (IT Raids) చేపట్టారు. ఇటీవల వరుసగా నగరంలో తనిఖీలు చేపడుతుండటం గమనార్హం. గతంలో బంగారు వర్తకుల ఇళ్లలో సోదాలు చేసిన అధికారులు.. తాజాగా ప్రముఖ హోటళ్ల ఛైర్మన్లు, డైరెక్టర్లపై రైడ్ చేశారు.
నగరంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు మంగళవారం ఉదయం తనిఖీలు ప్రారంభించారు. ఏకకాలంలో 30 చోట్ల సోదాలు చేపడుతున్నారు. నగరంలోని ప్రముఖ హోటళ్లు అయిన పిస్తా హౌస్ , షా గౌస్ (Shah Ghaus), మెహ్ఫిల్ గ్రూప్‌కు చెందిన హోటళ్ల నిర్వాహకుల ఇళ్లలో తనిఖీలు చేపట్టడం గమనార్హం. పిస్తాహౌస్, షా గౌస్, మెహ్ఫిల్ హోటళ్లు హైదరాబాద్ (Hyderabad) కేంద్రంగా వ్యాపారం నిర్వహిస్తున్నాయి. ప్రతి సంవత్సరం వందల కోట్ల విలువైన వ్యాపారాన్ని చేస్తున్నాయి. దీంతో అధికారులు తాజాగా సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది.
IT Raids | అమ్మకాల వివరాలపై ఆరా..
ఆయా హోటళ్లలో కోట్ల రూపాయల విలువైన అమ్మకాల వివరాలు గోప్యంగా ఉంచినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. మెహ్ఫిల్ రెస్టారెంట్ (Mehfil Restaurant)కు నగరంలో 15 బ్రాంచ్‌లు ఉన్నాయి. యూఏఈలో కూడా దీనికి బ్రాంచ్‌లు ఉండటం గమనార్హం. పిస్తా హౌజ్ (Pistachio House)కు విదేశాలతో కలుపుకొని మొత్తం 44 హోటళ్లు ఉన్నాయి. షాగౌజ్ హోటళ్లు గచ్చిబౌలి, ఓల్డ్ సిటీలలో నిర్వహిస్తున్నారు. హోటళ్ల ప్రధాన కార్యాలయాతో పాటు, ఓనర్లు ఇళ్లలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
IT Raids | ఆదాయంలో వ్యత్యాసం
రాజేంద్రనగర్ (Rajendranagar)లోని పిస్తా హౌస్ యజమానులు మహమ్మద్ మాజిద్, మహమ్మద్ ముస్తాన్ ఇళ్లల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. రికార్డుల్లో చూపిన ఆదాయం, నిజమైన ఆదాయం మధ్య తేడాలు ఉన్నట్లు సమాచారం. హవాలా, అనుమానాస్పద లావాదేవీలు ఉన్నట్లు తెలుస్తోంది. పిస్తా హౌస్‌లో పనిచేసే వర్కర్ల ఇళ్లల్లోనూ తనిఖీలు చేపడుతున్నారు. తనిఖీలు పూర్తయిన తర్వాత అధికారులు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
