Homeతాజావార్తలుIT raids | పిస్తా హౌస్​ సహా ప్రముఖ రెస్టారెంట్లలో ఐటీ సోదాలు.. రూ. 20...

IT raids | పిస్తా హౌస్​ సహా ప్రముఖ రెస్టారెంట్లలో ఐటీ సోదాలు.. రూ. 20 కోట్ల నగదు, భారీగా బంగారం పట్టివేత!

IT raids | హైదరాబాద్​ పరిధిలోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో ఐటీ శాఖ సోదాలు జరుపుతోంది. పిస్తా హౌస్, షాగౌస్, మెహిఫిల్ హోటల్స్, రెస్టారెంట్లలో సోదాలు కొనసాగుతున్నాయి.

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: IT raids | గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో ఐటీ శాఖ సోదాలు జరుపుతోంది. పిస్తా హౌస్, షాగౌస్, మెహిఫిల్ హోటల్స్, రెస్టారెంట్లలో రెండు రోజులుగా సోదాలు కొనసాగుతున్నాయి.

ఇప్పటికే ఆయా యజమానుల వద్ద ఉన్న లెక్కలు చూపని రూ. 20 కోట్ల నగదు, భారీగా బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

IT raids | యజమానాల ఇళ్లతోపాటు హోటళ్లలో..

రాజేంద్రనగర్ గోల్డెన్ హైట్స్ కాలనీలోని పిస్తా హౌస్ ఓనర్ మహమ్మద్ మాజీద్, మహమ్మద్ ముస్తాన్ ఇళ్లతో పాటు షాగౌస్, మెహ్ ఫిల్ ఛైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు.

అత్తాపూర్, టోలీచౌకి, లక్డీకాపూల్, షేక్‌పేట్, గచ్చిబౌలి సహా గ్రేటర్ హైదరాబాద్‌లోని 30 ప్రాంతాల్లో రెండు రోజులుగా సోదాలు కొనసాగుతుండటం గమనార్హం.

ఆయా యజమానుల నుంచి రూ. 20 కోట్ల నగదు, భారీగా బంగారం పట్టుబడినట్లు తెలిసింది. వీటితోపాటు వర్కర్ల పేర్లతో ఉన్న బినామీ ఆస్తుల డాక్యుమెంట్లు సహా కీలక పత్రాలు, పలువురి పేరున బ్యాంకు లాకర్లను అధికారులు గుర్తించినట్లు సమాచారం.

బ్లాక్ మనీని హవాలా రూపంలో దారి మళ్లించినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉందంటున్నారు.