అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Iran Protests | అగ్రరాజ్యం అమెరికా (America)కు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. తమపై దాడి చేస్తే ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకుంటామని ప్రకటించింది.
ఇరాన్లో ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాది మంది నిరసన చేపడుతున్నారు. ఈ ఘటనల్లో అనేక మంది చనిపోయారు. దీంతో ఇరాన్‌పై దాడి చేస్తామని ట్రంప్ (Donald Trump) హెచ్చరించారు. ఆందోళనకారులకు ఏదైనా జరిగితే రంగంలోకి దిగుతామని పేర్కొన్నారు. అయితే ట్రంప్ తీరుపై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ (Iran Supreme Leader Khamenei) ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ పేరు ప్రస్తావించకుండా ఓ కార్టూన్‌ను పోస్ట్ చేశారు. అహంకారం, గర్వం తలకెక్కి ఈ ప్రపంచాన్నే శాసించాలని అనుకుంటున్నాడంటూ పోస్ట్ చేశారు. అమెరికా తమపై దాడి చేస్తే ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ ప్రకటించింది.
Iran Protests | వందలాది మంది మృతి
ఇరాన్లో ద్రవ్యోల్బణం, రియాద్ విలువ పడిపోవడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఆందోళనలను ఇరాన్ ప్రభుత్వం (Iran Government) అణచి వేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు 495 మంది నిరసనకారులు, 48 మంది భద్రతా సిబ్బంది మరణించినట్లు సమాచారం. 15 రోజులుగా సాగుతున్న నిరసనల్లో 10,600 మందిని అరెస్ట్ చేశారు. దీంతో ఇరాన్‌పై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నామని ట్రంప్ ప్రకటించారు. అమెరికా దాడి చేస్తే, ఇజ్రాయెల్, ఈ ప్రాంతంలోని యూఎస్ మిలిటరీ, షిప్పింగ్ కేంద్రాలపై తాము దాడులు చేస్తామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ హెచ్చరించారు.