అక్షరటుడే, డిచ్‌పల్లి: Electricity INTUC | ఐఎన్‌టీయూసీ 327 డిచ్‌పల్లి నూతన కార్యవర్గాన్ని యూనియన్ కార్యాలయంలో ఎన్నుకున్నారు. ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్, కార్యదర్శి పూదరి గంగాధర్, కోశాధికారి అంజయ్య ఆధ్వర్యంలో కార్యవర్గం ఎన్నికైంది.
Electricity INTUC | కార్యవర్గం ఇదే..
డిచ్‌పల్లి( Dichpally) డివిజన్ అధ్యక్షుడిగా పసుల మనోహర్, కార్యదర్శిగా సంతోష్, ఉపాధ్యక్షుడిగా నసీరుద్దీన్, కోశాధికారిగా చంద్రశేఖర్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పెంటయ్య చారి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన డివిజన్ కమిటీని జిల్లా కమిటీ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు.
