Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | మహిళా సంఘాలకు రూ.304 కోట్ల వడ్డీలేని రుణాలు

Kamareddy | మహిళా సంఘాలకు రూ.304 కోట్ల వడ్డీలేని రుణాలు

రాష్ట్రంలో మ‌హిళా సంఘాల‌కు రూ.304 కోట్ల వ‌డ్డీలేని రుణాలు ప్ర‌భుత్వం అంద‌జేస్తుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. భిక్కనూరులో మహిళలకు రుణాల చెక్కులు పంపిణీ చేశారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | రాష్ట్రంలో మ‌హిళా సంఘాల‌కు రూ.304 కోట్ల వ‌డ్డీలేని రుణాలు ప్ర‌భుత్వం అంద‌జేస్తుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Government advisor Shabbir Ali) తెలిపారు. భిక్కనూరు మండల కేంద్రంలోని ఎస్సీ గార్డెన్​లో మంగళవారం నిర్వహించిన వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్​తో (TPCC chief Mahesh Kumar Goud) కలిసి షబ్బీర్ అలీ పాల్గొన్నారు.

కామారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి రూ.3.25 కోట్ల వడ్డీలేని రుణాలకు (interest-free loans) సంబంధించిన చెక్కులను, ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 3.50 లక్షల స్వయం సహాయక మహిళా సంఘాలకు రూ.304 కోట్ల వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం అందించనుందన్నారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా వడ్డీలేని రుణాలను మూడోవిడత అందిస్తున్నామని పేర్కొన్నారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత రెండుసార్లు వడ్డీ లేని రుణాలను ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని మాటిచ్చామని, ఇప్పుడు నిరూపిస్తున్నామని పేర్కొన్నారు. మహిళలను వారి కాళ్ల మీద వారిని నిలబడేలా తీర్చిదిద్ది కుటుంబాలను అభివృద్ధి చేసేందుకు దృఢ సంకల్పంతో ఉన్నామని తెలిపారు. ప్రజాప్రభుత్వ హామీ మేరకు మహిళలకు అన్ని రంగాలలో అవకాశాలు కల్పిస్తున్నామన్నారు.

Kamareddy | బీఆర్ఎస్ ప్రజలకు చేసిందేమీ లేదు

పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ (BRS government) హయాంలో ప్రజలకు చేసిందేమీ లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలను కోటీశ్వరులను చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య లక్ష్యమన్నారు. మహిళల కోసం ఉచిత బస్సు పథకం రాష్ట్ర ప్రభుత్వం కల్పించినదన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలను పట్టించుకోలేదని విమర్శించారు. 15 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం 80 వేల ఉద్యోగాలను ఇచ్చిందని తెలిపారు. మహిళల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు.