అక్షరటుడే, ఆర్మూర్: Armoor MLA | మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి (MLA Rakesh Reddy) పేర్కొన్నారు. పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో మహిళా సంఘాల సభ్యులకు వడ్డీలేని రుణాలను మంగళవారం ఆయన పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వడ్డీలేని రుణాలను (interest-free loans) అర్హులైన మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళా సంఘాల జిల్లా అధికారిణి సంధ్యారాణి మాట్లాడుతూ.. మహిళల తీసుకున్న వడ్డీలేని రుణాలకు రాయితీలను అందించడం జరిగిందన్నారు. ఒక సంఘం రూ.20 లక్షల రుణం తీసుకుంటే రూ.5 లక్షల వరకు రాయితీ వస్తుందని తెలిపారు.
జిల్లాలో మొత్తం 19,026 సంఘాలకు రూ.23.25 కోట్లు రాయితీ వచ్చిందని పేర్కొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో (Armoor constituency) 3,180 సంఘాలకు రూ. 3.25 కోట్ల వడ్డీలేని రుణాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. సంఘ సభ్యులు లోన్ పూర్తిగా కడితే వారి ఖాతాలో డబ్బులు నేరుగా జమవుతాయన్నారు. కార్యక్రమంలో ఆర్మూర్ ఏఎంసీ ఛైర్మన్ సాయిబాబా గౌడ్, మహిళా సంఘాల నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
