అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Big Boss Season-9 | బిగ్‌బాస్ తెలుగు సీజన్-9లో (Big Boss Season-9) ఈ వారం నామినేషన్స్ ఎపిసోడ్ పూర్తి హైడ్రామాగా మారిపోయింది. గత వారం ఫ్యామిలీ వీక్‌తో హౌస్ మొత్తం ఎమోషన్స్‌తో నిండిపోయినా, ఈ వారం నామినేషన్స్ హౌస్‌ను మరింత ఉద్రిక్తతలోకి నెట్టాయి.
తీవ్ర వాగ్వాదాలు, ఫిజికల్‌గా అటాకింగ్, బిగ్‌బాస్ ప్రాపర్టీ డ్యామేజ్… ఇలా సీజన్‌లోనే అత్యంత హైటెన్షన్ ఎపిసోడ్‌కి వేదికైంది బిగ్‌బాస్ హౌస్. వీకెండ్‌లో నాగార్జున (Nagarjuna) ఏ చర్య తీసుకుంటారా? అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో పెరిగింది.
Big Boss Season-9 | రెండు రకాల నామినేషన్స్.. అక్కడే మొదలైన ఘర్షణ
ఈ వారం నామినేషన్స్‌ను బిగ్‌బాస్ రెండు భాగాలుగా నిర్వహించాడు.
- సీక్రెట్ బ్యాలెట్ నామినేషన్ – హౌస్‌మేట్ ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటారో వారి పేరు రాసి బాక్స్‌లో వేయాలి.
- వైల్డ్ ఫైర్ నామినేషన్ – నామినేట్ చేయాలనుకున్న వ్యక్తి ఫొటోని మంటల్లో వేయాలి.
రెండో రౌండ్ గొడవలకు కారణమైంది. కళ్యాణ్ (Kalyan).. డీమాన్‌ను నామినేట్ చేస్తూ ..“లాస్ట్ వీక్ కెప్టెన్సీ కంటెండర్‌షిప్ నువ్వు ఈజీగా గివప్ ఇచ్చేశావ్” అని చెప్పాడు. దీనిపై డీమాన్ (Demon Pawan) కౌంటర్ సమాధానం ఇస్తూ కళ్యాణ్‌పై కామెంట్స్ చేయడంతో వాదన వాడివేడిగా సాగింది. ఆ తర్వాత డీమాన్, ఇమ్మానుయేల్‌ను (Emmanuel) నామినేట్ చేస్తూ “నీ మాట నిలబెట్టుకోలేదు” అని ఆరోపించాడు. దీంతో ఇమ్మూ, డీమాన్ మధ్య కూడా వాగ్వాదాలు జరిగాయి. అయితే ఇమ్మూ–డీమాన్ వాదనలో కళ్యాణ్ కూడా జోక్యం చేసుకోవడంతో, రీతూ ఫైర్ అయింది. రీతూ.. డీమాన్‌ను సపోర్ట్ చేస్తూ కళ్యాణ్‌కు సమాధానం ఇవ్వగా.. “నువ్వు అరిచినంత మాత్రాన ఏం కాదు.. నువ్వే నా మీద నిందలు వేసావ్” అంటూ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇద్దరి మధ్య ఈ ఘర్షణ ఒక్కసారిగా తీవ్రమైంది. రీతూ (Ritu Chowdary) కూడా గట్టిగానే కౌంటర్ ఇవ్వడంతో వాతావరణం మరింత వేడెక్కింది. ఈ వివాదం ముదరడంతో కళ్యాణ్ రీతూ వైపు దూసుకెళ్లాడు. ఇది గమనించిన డీమాన్ వెంటనే కళ్యాణ్ ముందుకు వచ్చి అడ్డుకున్నాడు. కళ్యాణ్ ఆగకపోవడంతో డీమాన్ అతన్ని పీక పట్టుకుని వెనక్కి నెట్టాడు. ఇమ్మానుయేల్ వెంటనే ముందుకొచ్చి డీమాన్‌ను పక్కకు లాగాడు. ఇది బిగ్ బాస్ తెలుగు చరిత్రలో అరుదుగా జరిగే సీరియస్ మూమెంట్‌గా నిలిచింది. అయితే ఈ కోపంలో కళ్యాణ్ పక్కనే ఉన్న కుర్చీలను తన్ని పడేశాడు. రీతూ “డోంట్ డూదట్!” అని అడ్డుకోగా, కళ్యాణ్ మరింత రెచ్చిపోయి మళ్లీ రీతూపై అరిచాడు. హౌస్‌లోని ఇతర సభ్యులు ఇద్దరినీ ఆపేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.
