అక్షరటుడే, ఇందూరు: JCI Indur | నగరంలో జేసీఐ ఆలుమ్ని క్లబ్ (CI Alumni Club) ద్వారా విశేష సేవలు అందిస్తున్న దంపతులు లావణ్య విజయనంద్కు జేసీఐ ప్రతిష్టాత్మక అవార్డులు (JCI awards) దక్కాయి. ఈ మేరకు హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఆలుమ్ని క్లబ్ జోన్ కాన్ఫరెన్స్–2025 జరిగింది. కార్యక్రమంలో నిజామాబాద్ నగరానికి (Nizamabad city) చెందిన దంపతులు విజయానంద్‌కు అవుట్‌స్టాండింగ్ జోన్ వైస్ ఛైర్మన్ అవార్డు అందుకున్నారు. అలాగే ఆయన సతీమణి లావణ్యకు అవుట్‌స్టాండింగ్ లేడీ మెంబర్ అవార్డు దక్కింది.
JCI Indur | ఏడాది పొడవునా ప్రాజెక్టులు..
గతేడాది పొడవునా వివిధ ప్రాజెక్టులు, కార్యక్రమాల ద్వారా వీరిద్దరు చేసిన సేవా కార్యక్రమాలను జేఏసీ ఇంటర్నేషనల్ గుర్తించి అవార్డులు అందజేసిందని జోన్ ఛైర్మన్ డీవీఎస్‌పీ గుప్తా పేర్కొన్నారు. కార్యక్రమంలో జేసీఐ నేషనల్ ఆఫీసర్లు సునీల్ కుమార్, వినయ్ మెహతా, మనోజ్ టక్కర్, జీవీఎన్ రాజు, చతుర్వేది, జోన్ అధికారులు నవీన్ చావ్లా, శ్రీనివాస్, శ్యాంసుందర్, బ్రహ్మం, శ్రీపూజ, తదితరులు పాల్గొన్నారు.
