అక్షరటుడే, ఇందూరు: Yoga Championship | రాష్ట్రస్థాయి యోగా (state-level yoga) పోటీల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపారని యోగా అసోసియేషన్ కార్యదర్శి గంగాధర్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం వివరాలు వెల్లడించారు. ఈనెల 8,9 తేదీల్లో రంగారెడ్డి జిల్లాలోని ఎస్ఎంపీ ఇంటర్నేషనల్ స్కూల్లో (SMP International School) 12వ రాష్ట్రస్థాయి యోగాసన పోటీలు జరిగాయని వివరించారు.
ఈ పోటీల్లో జిల్లాకు చెందిన అండర్ 8–10 బాలికల విభాగంలో ఆర్ రిషిత రెండవస్థానంలో, జె. రిశ్విత మూడవ స్థానంలో సాధించిందని ఆయన వివరించారు. అలాగే పి. మేధా చౌదరి ఐదో స్థానం సాధించిందని పేర్కొన్నారు. 12–14 ఏళ్ల విభాగంలో స్మైత్రికా చారి మూడవ స్థానం, 14–16 ఏళ్ల బాలికల విభాగంలో డి.శ్లోకా చారి మూడవ స్థానం, 14–16 బాలుర విభాగంగా బి. వర్షిత్ ప్రథమ స్థానం, బి. శ్రీకర్ 4వ స్థానం సాధించారని పేర్కొన్నారు. అలాగే నిజామాబాద్ జిల్లా (Nizamabad District) ఓవరాల్ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా 40 పాయింట్లు సాధించిందని తెలిపారు.
