అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: Indiramma Housing Scheme | ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లతో భరోసా కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali) పేర్కొన్నారు. దోమకొండ మండల కేంద్రంలో ఇందిరమ్మ మోడల్ ఇంటిని (Indiramma Model House)) పరిశీలించారు. అనంతరం హరిజనవాడలో ఇందిరమ్మ ఇల్లు (indiramma illu) లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. కామారెడ్డి నియోజకవర్గంలో 3,028 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. త్వరలో మరో 472 లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
