Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి సాధించాలి

అక్షరటుడే, ఇందూరు: Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో స్పష్టమైన పురోగతి కనిపించేలా క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని మున్సిపల్ పట్టణాలు, జీపీల్లో లబ్ధిదారుల వివరాలను రెండు రోజుల్లోగా పీఎం ఆవాస్ యోజన (PM Awas Yojana) గ్రామీణ పోర్టల్​లో నమోదు […]

అక్షరటుడే, ఇందూరు: Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో స్పష్టమైన పురోగతి కనిపించేలా క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని మున్సిపల్ పట్టణాలు, జీపీల్లో లబ్ధిదారుల వివరాలను రెండు రోజుల్లోగా పీఎం ఆవాస్ యోజన (PM Awas Yojana) గ్రామీణ పోర్టల్​లో నమోదు చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకునేలా ప్రోత్సహించాలని, వారికి ఉచిత ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇళ్ల నిర్మాణాలకు సుముఖంగా లేని లబ్ధిదారుల నుంచి లిఖితపూర్వకంగా లేఖలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం జారీ చేసిన నూతన మార్గదర్శకాలను పాటిస్తూ.. అర్హులైన వారికి 15 రోజుల్లోపు డబుల్ బెడ్ రూమ్ (Double Bedroom Houses) ఇళ్లను కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Indiramma Housing Scheme | ఎంపీడీవోలపై ఆగ్రహం..

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల విషయంలో అలసత్వం వ్యవహరిస్తున్న ఎంపీడీవోలపై (MPDO) కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహిస్తూ.. నిర్దేశిత లక్ష్యాల సాధన కోసం దిశా నిర్దేశం చేస్తున్నప్పటికీ ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిలదీశారు. ఇలాంటి వైఖరితో ఉంటే ఏ మాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు.

Indiramma Housing Scheme | వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలి..

వనమహోత్సవాన్ని (vana mahostsavam) జిల్లావ్యాప్తంగా విజయవంతం చేయాలని కలెక్టర్​ పేర్కొన్నారు. వర్షాల కోసం ఎదురు చూడకుండా, నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించేలా చూడాలన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులను, విద్యార్థులను, అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేయాలన్నారు. అలాగే సీజనల్ వ్యాధులు (Seasonal diseases) ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్​లో అదనపు కలెక్టర్​ అంకిత్, డీఆర్డీవో సాయాగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.