అక్షరటుడే, హైదరాబాద్: Indiramma sarees | మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ Indira Gandhi జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Chief Minister Revanth Reddy రాష్ట్రంలోని మహిళల కోసం కీలక కార్యక్రమాన్ని ప్రకటించారు.
Indiramma sarees | నెక్లెస్ రోడ్డులో..
నేటి (నవంబరు 19) నుంచి మహిళలకు చీరలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహం వద్ద మధ్యాహ్నం 12 గంటలకు ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించనున్నారు.
మహిళా సాధికారతకు, సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న తమ ప్రభుత్వం, కోటి మందికి పైగా మహిళలకు చీరలు అందజేయాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు.
