అక్షరటుడే, భీమ్గల్: Indira Gandhi Jayanti | దివంగత మాజీ ప్రధాని ఇందిరా ఇందిరాగాంధీ జయంతిని (Indira Gandhi Jayanti) జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
భీమ్గల్ మండలంలోని బడాభీమ్గల్ గ్రామంలో (Bada Bheemgal village) బుధవారం ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పండ్లు, మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. భారతదేశానికి మొదటి ప్రధానమంత్రిగా ఎన్నికైన ఇందిరాగాంధీ (Indira Gandhi) దేశానికి ఎనలేనని సేవలందించారన్నారు.
దేశవ్యాప్తంగా ఇళ్లులేని నిరుపేదలకు ఇళ్లస్థలాలు, పక్కాఇల్లు నిర్మించి, భూమిలేని నిరుపేదలకు భూములు పంచారన్నారు. నిరుపేదల గుండెల్లో ఇందిరాగాంధీ చిరస్థాయిగా నిలిచిపోయారాని కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు (Congress party leaders) ఘనపురం సురేష్, పిట్ల శ్రీనివాస్, రాగుల మోహన్, గట్టు సతీష్, రాగుల లింబన్న, ముల్క అరుణ్, దాకటి స్వామి, సంజయ్, రాజన్న, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Indira Gandhi Jayanti | కమ్మర్పల్లిలో..
అక్షరటుడే, కమ్మర్పల్లి: Indira Gandhi Jayanti | మండలలోని ఉప్లూర్ గ్రామంలో (Uppuluru village) బుధవారం కాంగ్రెస్ మండలాధ్యక్షుడు సుంకెట రవి ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని నిర్వహించారు. ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరాగాంధీ దేశం కోసం ప్రాణ త్యాగం చేశారన్నారు. ఆమె సేవలు మరువలేనివని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాలెపు నర్సయ్య, పార్టీ నాయకులు అజ్మత్ పాషా, బుచ్చి మల్లయ్య, తిప్పిరెడ్డి శ్రీనివాస్, రాజేష్,రాకేష్, పూజారి శేఖర్, నడిపి గంగాధర్, గణేష్, నాగరాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.

