అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ind vs SA | సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లోనూ భారత బ్యాట్స్‌మెన్ విఫలం అయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో 201 పరుగులకే ఆలౌట్ అయ్యారు.
తొలి టెస్ట్‌లో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో సైతం భారత టాప్ ఆర్డర్ విఫలం అయింది. తొలి ఇన్నింగ్స్‌లో సౌత్ ఆఫ్రికా (South Africa) 489 పరుగులు చేయగా.. భారత్ 201 రన్స్‌కు పరిమితమైంది.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు రాణించడంతో భారీ పరుగులు చేసింది. ముత్తుస్వామి సెంచరీతో రాణించగా మిగతావారు సైతం సత్తా చాటారు. మార్కో జాన్సన్ 93 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం లభించింది. ఓపెనర్లు జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 22 పరుగులు చేశారు. అయితే 65 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ (KL Rahul), 95 పరుగుల వద్ద జైస్వాల్ (Jaiswal) అవుట్ అయ్యారు. అనంతరం భారత్ కష్టాల్లో పడింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ విఫలం అయ్యారు. సాయి సుదర్శన్ 15, ద్రువ్ జురేల్ 0, కెప్టెన్ పంత్ 7, జడేజా 6, నితిష్రెడ్డి 10 పరుగులు చేశారు.
Ind vs SA | సుందర్ పోరాటం
మిడిలార్డర్ వైఫల్యంతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత్‌ను గట్టెక్కించడానికి వాషింగ్టన్ సుందర్ ఒంటరి పోరాటం చేశాడు. బౌలర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav)తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సుందర్ 48, కుల్దీప్ 19 పరుగులు చేశారు. కులదీప్ యాదవ్ 134 బంతులు ఎదుర్కొన్నాడు. వీరిద్దరు కలిసి 72 పరుగులు జోడించడంతో భారత్ 201 పరుగులు చేయగలిగింది. లేదంటే 150 పరుగులోపే ఆలౌట్ అయి ఉండేది. ప్రత్యర్థి బౌలర్లలో జాన్సెన్ 6, సైమన్ 3 వికెట్లు తీశారు.
