అక్షరటుడే, ఇందల్వాయి: Indalwai railway gate | రైల్వేగేట్‌ను ఆటో ఢీకొట్టింది. దీంతో గేటు విరిగి కింద పడిపోయింది. ఫలితంగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో చోటుచేసుకుంది. ఈ మండల కేంద్రంలో రైల్వేగేట్ (Indalwai railway gate) ఉంది. కాగా, శనివారం సాయంత్రం రైలు వస్తుండటంతో సిబ్బంది గేట్ వేశారు.
Indalwai railway gate | దూసుకొచ్చిన ఆటో..
అయితే, అదే సమయంలో వేగంగా వచ్చిన ఆటో గేట్‌ను ఢీ కొట్టింది. దీంతో గేట్ విరిగిపోయింది. స్పందించిన రైల్వే సిబ్బంది (railway staff) ప్రత్యామ్నాయ గేట్ వేసి, రైలు వెళ్లే వరకు ట్రాఫిక్‌ను నియంత్రించారు.
అనంతరం వాహనాల రాకపోకలను పునరుద్దరించారు. కాగా, గేటు విరిగిపోవడంతో సుమారు 20 నిమిషాల పాటు వాహనాల రాకపోలకు అంతరాయం ఏర్పడింది.
