అక్షరటుడే, వెబ్‌డెస్క్: IND vs NZ 1st ODI Result | సిరీస్ మొదటి వన్డేలో న్యూజిలాండ్‌ను నాలుగు వికెట్ల తేడాతో భారత జట్టు ఓడించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు 1-0 ఆధిక్యంతో ఉంది. ఇక రాజ్‌కోట్‌లో జనవరి 14న రెండో మ్యాచ్ జరగనుంది.
వడోదర Vadodara లోని కోటంబి స్టేడియం Kotambi Stadium లో ఆదివారం (జనవరి 11) జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ New Zealand నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది.
IND vs NZ 1st ODI Result | అంతర్జాతీయ క్రికెట్‌లో..
తదుపరి 301 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీం ఇండియా.. 49 ఓవర్లలోనే 6 వికెట్ల తేడాతో విజయం సొంతం చేసుకుంది. క్రిస్టియన్ క్లార్క్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ సిక్స్ కొట్టి విజయాన్నిఅందించాడు. 29 పరుగులతో రాహుల్ నాటౌట్‌గా నిలిచాడు. విరాట్ 93, కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ 56, శ్రేయాస్ 49 పరుగులు చేశారు. ఇక న్యూజిలాండ్ బౌలర్ కైల్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 42 పరుగులు చేసిన వెంటనే శ్రీలంక ఆటగాడు కుమార్ సంగక్కర (28,016 పరుగులు)ను అధిగమించి రికార్డులో నిలిచాడు. ఇక ఇప్పటికీ మొదటి స్థానంలో సచిన్ (34,357 పరుగులు) మాత్రమే ఉన్నాడు.
భారత్: శుభమన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
న్యూజిలాండ్: మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, డెవాన్ కాన్వే, విల్ యంగ్, గ్లెన్ ఫిలిప్స్, మిచ్ హే (వికెట్ కీపర్), జాక్ ఫాల్క్స్, మైఖేల్ రే, కైల్ జామిసన్, ఆదిత్య అశోక్, క్రిస్టియన్ క్లార్క్.